Begin typing your search above and press return to search.

పాస్ పోర్ట్ చిక్కుల్లో వారిద్దరూ!!

By:  Tupaki Desk   |   23 Jun 2018 8:31 AM GMT
పాస్ పోర్ట్ చిక్కుల్లో వారిద్దరూ!!
X

సినిమా తారలు అన్నాక పాస్ పోర్టులు.. వీసాలు తప్పనిసరి. అటు సినిమాల కోసమో.. లేకపోతే ఎండార్స్ మెంట్స్ కోసమో.. ఈవెంట్ల కోసమో.. వ్యక్తిగత పర్యటనల కోసం.. తరచుగా ఫారిన్ ట్రిప్పులు వేస్తూనే ఉంటారు. మరి ఇలాంటి వారికి పాస్ పోర్టు ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు.

గత కొన్ని రోజులుగా ఓ ఇద్దరు తారలు పాస్ పోర్ట్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతుండడం మీడియా కళ్లకు చిక్కింది. ఇంతకీ వీరి పాస్ పోర్టులకు వచ్చిన చట్టపరమైన సమస్యలు ఏమీ లేవు కానీ.. వాటిని వారు రెన్యువల్ చేయించుకోవడంలోనే అలసత్వం చూపారంతే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వెలిగిపోయిన టబు ఇలాగే పాస్ పోర్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. ఈమెకు తన పనులు తానే చేసుకోవడం అలవాటట. అందుకనే ఏజెంట్స్ లాంటి వారిని ఎవరినీ ఎంకరేజ్ చేయకుండా తానే ఆఫీస్ కు వచ్చి వెళుతోందట.

మరోవైపు హర్షవర్ధన్ రాణే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇతడైతే రెన్యూవల్ చేయించుకోవడం మర్చిపోయాడు. రీసెంట్ గా ఓ సినిమా ప్రమోషన్ కోసం విదేశాలకు వెళ్లే అవసరం రాగా.. ఆ సమయంలో ఇతడు తన పాస్ పోర్ట్ వ్యాలిడిటీ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉందని గుర్తించాడట. దీంతో తనే ఈ పనులు చక్కబెట్టుకుని చకచకా పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం కుస్తీ పడుతున్నాడని తెలుస్తోంది.