Begin typing your search above and press return to search.

నదియాకు నో చెప్పి టబుకి అంతిస్తున్నారా?

By:  Tupaki Desk   |   27 July 2016 11:30 AM GMT
నదియాకు నో చెప్పి టబుకి అంతిస్తున్నారా?
X
ఇంకో మూడు నెలల్లో టబుకి 45 ఏళ్లు నిండుతాయి. ఈ వయసులో కూడా ఆమె డిమాండింగ్ పొజిషన్లో ఉండటం విశేషమే. ఆల్రెడీ హిందీలో ఆమె మూణ్నాలుకు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో కూడా ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న టెక్నో థ్రిల్లర్ మూవీ ‘భాగమతి’లో ఓ కీలక పాత్రకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం టబు తీసుకుంటున్న పారితోషకమెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఏకంగా రూ.60 లక్షలిస్తున్నారట ఆమె.

రెజీనా లాంటి మీడియా రేంజి హీరోయిన్లు దాదాపు ఇంతే పారితోషకం తీసుకుంటున్నారు. టబు ఈ వయసులోనూ ఈ స్థాయిలో పారితోషకం తీసుకోవడం మామూలు విషయం కాదు. ఇందులో టబు సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తుందట. టబు మాత్రమే చేయగలిగే పాత్ర కాబట్టి.. ఆమె చేస్తే ఆ క్యారెక్టర్ కు వెయిట్ వస్తుందని ఆమెకు అంతిచ్చి ఓకే చెప్పించారు. నిజానికి ముందు ఈ పాత్రకు నదియాను అనుకున్నారట. ఆమెకు రూ.20 లక్షలే పారితోషకంగా ఇవ్వడానికి కూడా అంగీకారం కుదిరిందట. ఐతే ఆమె ఇప్పటికే థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’లోనూ పోలీస్ అధికారిగా నటించింది కాబట్టి.. వద్దనుకున్నారట. విశేషం ఏంటంటే.. ‘దృశ్యం’ హిందీ రీమేక్ లో ఇదే పోలీస్ పాత్రను టబు చేసింది. కాకపోతే ఆ సినిమాతో మనోళ్లకు పరిచయం లేదు కాబట్టి ఇబ్బంది లేకపోయింది.