Begin typing your search above and press return to search.

అల వైకుంఠపురం అమ్మగారు..

By:  Tupaki Desk   |   22 Sep 2019 6:38 AM GMT
అల వైకుంఠపురం అమ్మగారు..
X
త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో చాలా ఏళ్ళ తర్వాత టబు టలీవుడ్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కు అమ్మ పాత్రలో టబు నటిస్తోందని.. నాన్న పాత్రలో మలయాళ నటుడు జయరామ్ నటిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే టబు - జయరామ్ కాంబినేషన్లో కొన్ని సీన్లను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించారట. ఇదిలా ఉంటే తాజాగా టబు 'అల వైకుంఠపురములో' తాజా షెడ్యూల్ లో పాల్గొనేందుకు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో టబు కనిపించడం.. టబుకు ఫోటోలు తీయడం చకచకా జరిగిపోయాయి. సిసలైన బాలీవుడ్ బ్యూటీ తరహాలో టబు ఒక గ్రే కలర్ గౌన్ ధరించి.. చలువకళ్ళజోడు.. పెద్ద హ్యాండ్ బ్యాగ్ తో స్టైలిష్ గా నడుచుకుంటూ విమానాశ్రయంలో కనిపించారు. నలభైలలో ఉన్నప్పటికీ ఇంకా పర్ఫెక్ట్ వెయిట్.. గ్లామర్ ను మెయింటెయిన్ చెయ్యడం అంటే మాటలు కాదు కదా. అందుకే త్రివిక్రమ్ టబు ను టాలీవుడ్ కు తీసుకొస్తున్నారేమో.

టబు పాత్ర బన్నీ సినిమాకు ప్లస్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా ఉన్న సీనియర్ హీరోయిన్లకు కీలక పాత్రలు ఇస్తూ సినిమాకు డిఫరెంట్ ఫీల్ ఇస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమాలో టబును ఎంచుకోవడం విశేషం. మరి ఈ సినిమాతో టబు తెలుగు ఇండస్ట్రీలో బిజీగా మారుతుందేమో వేచి చూడాలి.