Begin typing your search above and press return to search.

పింక్ పాప పాఠాలు చెబుతోందిగా

By:  Tupaki Desk   |   23 Feb 2017 6:23 AM GMT
పింక్ పాప పాఠాలు చెబుతోందిగా
X
ఈ ఏడాది వరుసగా సినిమాలు రిలీజ్ చేసేస్తోంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. ఇప్పటికే ఈ భామ నటించిన ఘాజీ.. రన్నింగ్ షాదీ మూవీలో థియేటర్లలోకి వచ్చేయగా.. నామ్ షబానా అంటూ మార్చ్ 31న విడుదల కాబోతోంది. వరుసగా సినిమాలు రిలీజ్ కావడంతో.. మరింతగా తన ట్యాలెంట్ ను బాలీవుడ్ ప్రేక్షకులకు చూపించే ఛాన్స్ వచ్చిందంటోంది తాప్సీ.

'షబానా పాత్రకు.. తాప్సీకి ఓ విధమైన సారూప్యత లేదు. అందుకే ఈ రోల్ కోసం డైరెక్టర్ చెప్పినట్లుగా చేశాను. మహిళలు ఎదుర్కునే సమస్యలు.. మళ్లీ వారిపైనే నింద వేసే సందర్భాల లాంటి వాటి గురించి చర్చించుకున్నాం. నా ఉద్దేశ్యం ప్రకారం.. మహిళలు తమ భద్రతను తమ చేతుల్లోకి తీసుకోవాల్సిందే. అలా చేస్తే.. ఏదైనా జరుగుతున్నపుడు ఎవరి సాయం కోసం అయినా ఎదురుచూడకుండా అప్పటికప్పుడే రియాక్ట్ కావచ్చు. నామ్ షబానా ఈ విషయంలో కొంతమందికి అయినా సెల్ఫ్-డిఫెన్స్ నేర్చుకునేందుకు స్ఫూర్తి అవుతుందని ఆశిస్తున్నా' అంటూ పాఠాలు చెప్పేస్తోంది తాప్సీ పన్ను.

నేనే షబానా అంటూ తెలుగులో కూడా రానున్న ఈ సినిమా కోసం మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది తాప్సీ. ఇక అక్షయ్ ఎదురుగుండా మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించాల్సి రావడం చాలా గర్వంగా అనిపించిందని కూడా చెప్పింది. అక్షయ్ కుమార్ కూడా తాప్సీని తెగ పొగిడేస్తున్నాడు. బేబీ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆమె నటన.. షబానా మూవీ తీయడానికి తమకు స్ఫూర్తి అంటున్నాడు అక్షయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/