Begin typing your search above and press return to search.

కొత్త బైక్ పై కొత్తకొత్తగా తాప్సీ

By:  Tupaki Desk   |   7 Feb 2016 3:50 AM GMT
కొత్త బైక్ పై కొత్తకొత్తగా తాప్సీ
X
నవీ.. ఈ పేరు చెప్పగానే ఇండియన్స్ కు రెండు విషయాలు గుర్తొస్తాయ్. ఒకటి అవతార్ సినిమాలో నవీ తెగ, రెండు నవీ ముంబై. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటోంది తాప్సీ నవీ గురించి. నవీ అనే ఓ కొత్త బైక్ ని తాప్సీ లాంఛ్ చేసింది. ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో.. కొత్త బైక్ తాప్సీ మెరిసింది.

హోండా కంపెనీ నుంచి వస్తున్న కొత్త మోడల్ బైక్ నవీ. ఇప్పటివరకూ ఇండియాలో ఉన్న బైక్ లుక్స్ కి భిన్నంగా కొత్తగా డిజైన్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తోంది ఈ కంపెనీ. దీన్ని ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించి, తాప్సీతో లాంఛ్ చేయించారు. ఈ ఢిల్లీ భామనే విడుదల చేయమనడానికి కారణం.. ఇప్పుడీ సుందరి హోండా బైక్స్ కంపెనీకి ఇండియా మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ కావడమే. రీసెంట్ గా ఈమేరకు తాప్సీ పన్నుతో ఒప్పందం కుదుర్చుకున్న హోండా.. ఢిల్లీ ఆటో ఎక్స్ పో నుంచి ప్రచారం ప్రారంభించింది.

'ఈ బైక్ లుక్ నాకు బాగా నచ్చేసింది. చాలా బాగుంది, ఇండియన్ రోడ్లపై కొత్త స్టార్ హోండా నవీని లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది' అని చెప్పిందీ హీరోయిన్. చిరుగుల జీన్స్ ప్యాంట్ - ఖాకీ షర్ట్, లూజ్ హెయిర్ తో.. బైక్ రైడ్ కి సిద్ధంగా తాప్సీ.. రైడర్ గా బాగానే సెట్ అయిపోయింది.