పారితోషికం విషయంలో తాప్సి కరెక్ట్ మాట

Sun Nov 18 2018 07:00:01 GMT+0530 (IST)

సౌత్ లో హీరోల పారితోషికంతో పోల్చితే హీరోయిన్స్ పారితోషికం అతి తక్కువగా ఉంటాయనే విషయం తెల్సిందే. హీరోల పారితోషికంకు హీరోయిన్స్ పారితోషికంకు అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం హీరోయిన్స్ పారితోషికాలు భారీగా ఉంటాయి. బాలీవుడ్ హీరోయిన్స్ స్థాయిలో తమ పారితోషికాలు ఉండాల్సిందే అంటే కొందరు సౌత్ హీరోయిన్స్ కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. హీరోలతో సమానంగా పారితోషికం ఎలా ఇస్తాం అంటూ ఫిల్మ్ మేకర్స్ పేచి పెడుతున్నారు.బాలీవుడ్ లో పలువురు హీరోయిన్స్ భారీగా పారితోషికం అందుకుంటున్నారు. అయితే పారితోషికం అనేది ఎక్కడైనా వారి వారి స్టార్ డంను బట్టి ఉంటుందని అంటున్నారు. ఇటీవలే అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ నా భార్య నేను కలిసి చాలా చిత్రాల్లో నటించాము. అయితే అన్ని సినిమాల్లో కూడా ఆమెకే ఎక్కువ పారితోషికం ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. స్టార్ డంను బట్టి పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేయాలి తప్ప హీరోలతో సమానంగా పారితోషికం ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు. తాజాగా ఈ విషయమై సొట్టబుగ్గల సుందరి తాప్సి కూడా స్పందించింది.

హీరోలతో సమానమైన పారితోషికంను తాను ఎప్పుడు కూడా డిమాండ్ చేయను అంది. స్థాయిని బట్టి పారితోషికం ఉండాలనేది తన అభిప్రాయం అంటూ తాప్సి పేర్కొంది. నేను అమితాబచ్చన్ వరుణ్ ధావన్ అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో నటించాను. వారితో సమానమైన పారితోషికం నేను డిమాండ్ ఎలా చేయగలను. వారు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగల క్రేజ్ ఉన్న స్టార్స్. వారితో సమానమైన పారితోషికం డిమాండ్ చేయడం అవివేకం అవుతుందని తాప్సి చెప్పుకొచ్చింది. తాప్సి చెప్పిన విషయంలో నూటికి నూరు శాతం నిజం ఉంది. ఆమె అన్నట్లుగా క్రేజ్ లేకుండా హీరోతో సమానమైన పారితోషికం హీరోయిన్ ఎలా డిమాండ్ చేయగలదు అంటూ కొందరు ఆమె అభిప్రాయంకు మద్దతు ఇస్తున్నారు. ఎవరి క్రేజ్ కు తగ్గట్లుగా వారి పారితోషికం ఉంటుందని ఎవరికి సినిమా పరిశ్రమలో అన్యాయం అనేది జరగదు అంటూ తాప్సి పేర్కొంది.