Begin typing your search above and press return to search.

అర్ధం చేసుకోండి.. సెల్ఫీ తీసుకోండి

By:  Tupaki Desk   |   23 May 2017 10:04 AM GMT
అర్ధం చేసుకోండి.. సెల్ఫీ తీసుకోండి
X
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ తెలుగు సినిమాలతోనే నటనలో అడుగులు పెట్టింది. గ్లామర్ కంటెంట్ తో పాటు కాస్తోకూస్తో నటన కూడా వచ్చి ఉండటంతో హీరోయిన్ గా దూసుకుపోతుందనే అందరూ అనుకున్నారు. అదేమిటో సినిమాలు ఆడినా తాప్సీకి పెద్దగా బ్రేక్ రాలేదు. స్టార్ హీరోల పక్కన అవకాశాలూ రాలేదు. దాంతో చెన్నైకి వెళ్లి అక్కడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. కానీ బ్యాడ్ లక్... అక్కడా పెద్దగా కలిసిరాలేదు. సౌత్ లో అవకాశాలు తగ్గిపోవడంతో ఃనెమ్మదిగా బాలీవుడ్ కి షిఫ్టయిపోయింది.

హిందీలో గత ఏడాది విడుదలైన పింక్ సినిమా తాప్సీకి కొంత పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ ఏడాది రానా హీరోగా వచ్చిన ఘాజీ సినిమాలోనూ కనిపించింది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి మంచి పేరొచ్చినా అందులో తాప్సీ పాత్రను ఎవ్వరూ పెద్దగా గుర్తించనే లేదు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత తాప్సీ మరోసారి తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 70ఎంఎం ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సి నటిస్తోంది.

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమా పేరేంటో అర్ధం కాకుండా పెట్టారు. పైగా ఆ పేరును అర్ధం చేసుకుని కరెక్ట్ గా గ్యెస్ చేసి తనకు ట్విట్టర్ లో చెబితే వారితో కలిసి సెల్ఫీ దిగుతానంటోంది. తాప్సీతో సెల్ఫీ దిగడానికి ిఇదే అవకాశం. చూసుకోండి మరి.