తాప్సీ షార్ట్ ఫిలిం ట్రైనింగ్!!

Thu Sep 14 2017 12:41:40 GMT+0530 (IST)

తాప్సీ పన్ను ఇప్పుడు నేషనల్ రేంజ్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారడమే కాదు.. టాలీవుడ్ లోనూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ మాంచి హిట్ ను సొంతం చేసుకుంది. కామెడీ బేస్డ్ గా సాగిన ఆనందో బ్రహ్మ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది తాప్సీ.

మరోవైపు బాలీవుడ్ లో హలోబ్రదర్ రీమేక్ కి సీక్వెల్ అయిన జుడ్వా2లో గ్లామర్ హీరోయిన్ గా కనిపించనుంది ఈ ఢిల్లీ బ్యూటీ. ఇప్పుడీ భామ మరో కొత్త ప్రయోగం కూడా చేసేస్తోందట. ఓ షార్ట్ ఫిలింలో తాప్సీ నటించేస్తోందని తెలుస్తోంది. హిందీ భాషలో తెరకెక్కుతున్న ఈ షార్ట్ ఫిలింలో తాప్సీ పన్ను.. ఓ సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేస్తుందట. బ్రదర్-సిస్టర్ రిలేషన్ బేస్డ్ గా సాగే ఈ షార్ట్ ఫిలింలో తాప్సీ చాలానే స్టంట్స్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. గతంలో  నామ్ షబానా మూవీ కోసం నేర్చుకున్న ఎన్నో టెక్నిక్స్ తో పాటు.. ఇప్పుడు కొత్తగా కూడా పలు రకాల ట్రైనింగ్స్ తీసుకుంటోందని తెలుస్తోంది. కపిల్ వర్మ ఈ షార్ట్ ఫిలింకు దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

తన కేరక్టర్ విషయంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. మహిళలకు స్ఫూర్తిగా నిలిచేలా ఈ రోల్ ఉండడంతోనే షార్ట్ ఫిలింకు తాప్సీ పన్ను ఒప్పుకుందని తెలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ పూర్తి కానుంది.