Begin typing your search above and press return to search.

టిట్ ఫర్ టాట్.. తాప్సీ ఆన్సర్

By:  Tupaki Desk   |   18 Dec 2018 11:04 AM GMT
టిట్ ఫర్ టాట్.. తాప్సీ ఆన్సర్
X
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. పాజిటివ్.. నెగెటివ్ రెండూ ఉంటాయి. సెలబ్రిటీల విషయానికి వస్తే ఫ్యాన్స్ తో టచ్ లో ఉండడం సులువయింది. కానీ కొందరు అల్లరిచిల్లరగా ఉండే నెటిజనులు మాత్రం సెలబ్రిటీలను వేధిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ బెడద ఎక్కువే. ఇలాంటి వేధించే నెటిజనులను హ్యాండిల్ చేయడం సెలేబ్రిటీలకు సులువైన పనేమీ కాదు. కానీ తాప్సీ లాంటి స్ట్రాంగ్ మహిళలు మాత్రం అలాంటి నెటిజనులకు గడ్డిపెట్టడంలో స్పెషలిస్టులు.

ఈమధ్య ఒక ట్విట్టర్ యూజర్ "తాప్సీ.. నీ శరీర భాగాలను నేను ప్రేమిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు. దీనికి సమాధానమిస్తూ "వావ్! నాక్కూడా ప్రేమే. ఇంతకీ నీ ఫేవరేట్ ఏంటి? నా ఫేవరేట్ అయితే బ్రెయిన్" అని స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది. చాలామంది తాప్సీ రిప్లై ని మెచ్చుకున్నారు. ఇలాంటి సమాధానాలు ఇవ్వడం తాప్సీకి మొదటి సారేమీ కాదు. గతంలో ఒకసారి పొట్టి గా ఉండే గౌన్ వేసుకున్నందుకు ఒక నెటిజన్ ట్రోల్ చేస్తే "నీలాంటి ఒక ఆణిముత్యాన్ని కనుక్కోవాలనే ఇలాంటి ఫోటో పోస్ట్ చేశాను. ఇలాంటి ఫోటో పోస్ట్ చేయకపోతే మన కల్చర్ ని కాపాడే నీలాంటి అరుదైన వజ్రాన్ని గుర్తించలేము కదా" అంటూ గడ్డి పెట్టింది.

గతంలో మరో సారి తాప్సీని 'నువ్వు బాలీవుడ్ లో చెత్త లుక్స్ ఉన్న నటివి. 2 ..3 సినిమాలు అంతే.. నువ్వు బాలీవుడ్ నుండి వెళ్ళిపోతావు." అన్నాడు. దీనికి సమాధానంగా "నిన్ను నిరాశాపరిచినందుకు బాధగా ఉంది. నేను ఇప్పటికే 3 సినిమాలు కంప్లీట్ చేశాను.. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. నువ్వు కొన్ని రోజులు ఇంకా నన్ను భరించక తప్పదు" అని ట్వీట్ చేసింది. మరి తాప్సీ తో పెట్టుకుంటే అంతే!