Begin typing your search above and press return to search.

తాప్సీ ఎగిరెగిరిపడింది ఈ సాంగ్ కోసమా?

By:  Tupaki Desk   |   28 July 2017 6:40 AM GMT
తాప్సీ ఎగిరెగిరిపడింది ఈ సాంగ్ కోసమా?
X
తెలుగు ఇండస్ర్టీ ఏముందిలే వంకాయ్ అన్నట్లు మొన్ననే చాలా కామెంట్లు చేసింది తాప్సీ పన్ను. కాకపోతే ఈ ఢిల్లీ పిల్లకు సోషల్ మీడియాలో తెలుగు అభిమానుల సెగ తగలడంతో వెంటనే సారీ చెప్పేసింది. నా నడుం బాగాలేదు కాబట్టి కొబ్బరికాయను నా బొడ్డుపై కొట్టారని.. అందరి నడుములపై రాఘవేంద్రరావు గారు పూలు పళ్ళూ వేయించారని చెబుతూ కవర్ చేసుకుంది. కాని ఈ ఓవర్ యాక్షన్లన్నీ కాస్త వర్కవుట్ కాలేదు తెలుసా?

అవును.. ఇప్పటివరకు తాప్సీకి బాలీవుడ్ లో అసలు గ్లామరసం చిందించే పాత్రలే రాలేదు. అక్కడ పెద్ద సినిమాల్లో ఛాన్సులొచ్చి కాస్త గ్లామర్ ఆరబోసే సీన్ ఉంటేనే పెద్ద హీరోయిన్ అయినట్లు లెక్క. అలా చూసుకుంటే తెలుగులోనైనా హిందీలోనైనా గ్లామర్ కే పెద్ద పీట. రెండు ముక్కల బికినీల్లో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్న ఆలియా భట్.. కత్రినా కైఫ్‌.. జాక్విలెన్ ఫెర్నాండెజ్ లే అక్కడ స్టార్ హీరోయిన్లు. అందుకే తాప్సీ కూడా తనకు ఇన్నాళ్లకు 'జుడ్వా 2' సినిమాలో అలాంటి గ్లామర్ రోల్ దక్కిందని.. ఇక తిరిగి చూసుకునే పనుండద అన్నట్లు గర్వపడింది. కాని అక్కడే ఉంది ట్విస్ట్.

వరుణ్‌ దావన్ హీరోగా రూపొందుతున్న ఈ 'హలో బ్రదర్' సీక్వెల్ లో మెయిన్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఆమె అందచందాల ముందు.. ఒంపుసొంపుల ముందు తాప్సీ పెద్దగా ఆనదు. అందులో డౌటే అక్కర్లేదు. ఇంకా పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో వరుణ్‌ అండ్ జాక్విలిన్ కాంబినేషన్లో ఏకంగా ఐదు పాటలు ఉన్నాయట. వాటిలో మూడు ఆల్రెడీ షూట్ చేశారట. అంటే తాప్సీకి దక్కింది మొత్తం ఆరుపాటల్లో కేవలం ఒకే ఒక్క సాంగ్ అనమాట. ఈ మాత్రం ఛాన్సు చూసుకునేనా అమ్మడు హిందీలో గ్లామర్ పండిస్తున్నా టాలీవుడ్డోళ్ళకు నా యాక్టింగ్ టాలెంట్ తెలియదు అంటూ ఎగిరెగిరిపడింది? పాపం పూర్ గాళ్‌!!