Begin typing your search above and press return to search.

తాప్సీ బాగానే భుజాన్నేసుకుందే

By:  Tupaki Desk   |   18 Aug 2017 1:21 PM GMT
తాప్సీ బాగానే భుజాన్నేసుకుందే
X
చాలామంది హీరోయిన్లు అసలు షూటింగ్ ఖతమ్ అయితే చాలు మళ్ళీ కనిపించరు. కాకపోతే ఈ మధ్యన కాజల్ వంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా తెగ ప్రమోషన్లకు వచ్చేస్తున్నారు. వద్దన్నా సరే టివిల్లో కనిపిస్తున్నారు రేడియోల్లో వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి భామలను చూసి చాలామంది ప్రేరణ పొందేస్తున్నారు కూడా. అదిగో మరోసారి తాప్సీ ఆ బాలీవుడ్ తరహా కల్చర్ ను పరిచయం చేసింది.

''ఆనందో బ్రహ్మా'' సినిమాను ఒప్పుకున్నప్పుడు ప్రమోషన్ ఏ విధంగా చేస్తుంది అనే విషయంపై ఏమన్నా మాటిచ్చిందో లేదో తెలియదో కాని.. సినిమా రిలీజ్ కు నాలుగు రోజుల ముందు నుండి మాత్రం తాప్సీ చితక్కొట్టేసింది. పేపర్లకూ వెబ్ సైట్లకూ ఇంటర్యూలు.. రకరకాల టివి ఛానళ్ళలో వేర్వేరు ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం.. రేడియోలకు తిరగడం.. సినిమాను వీలైనన్ని చోట్ల ప్రమోట్ చేయడం.. అలాగే రిలీజ్ రోజున సినిమా రిలీజైన ధియేటర్లకు వెళ్ళి టాక్ చెక్ చేసుకోవడం.. అబ్బో తాప్సీ సంపేసింది అంతే. మొత్తంగా తానై భుజాన్నేసుకుంది.

నిజానికి ఈ సినిమాకు తాప్సీయే పెద్ద సెల్లింగ్ పాయింట్. ఎందుకంటే మిగతా లీడ్స్ అందరూ కమెడియన్స్ గానే పాపులర్ కాబట్టి.. తాప్సీ ఒక్కత్తే హీరోయిన్ రేంజులో సినిమాను ప్రొజెక్ట్ చేయగలుగుతుంది. అలాంటి సుందరి ఈ రేంజులో ప్రమోట్ చేస్తే.. రీచ్ అదిరిపోతుంది అంతే. మరి తాప్సీని చూసి ఇప్పుడు ఎంతమంది ఇన్ స్పయిర్ అవుతారో చూద్దాం.