తాప్సీ.. ఈ సోలో ప్రయత్నాలేంటో..

Sun Aug 13 2017 11:48:26 GMT+0530 (IST)

రింగుల జుత్తు బ్యూటి తాప్సీ పన్ను ఉంది చూశారు.. ఆ మధ్యన ఏదో మాట జారి వివాదాలపాలైంది కాని.. నిజానికి ఇప్పుడున్న చాలామంది తెలుగు హీరోయిన్లకంటే అటు యాక్టింగ్ పరంగానూ ఇటు గ్లామరసం దారబోయడంలోనూ రెండాకులు ఎక్కువగానే ఉంటుంది. కాని అమ్మడికి తెలుగులో బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే బాలీవుడ్ వెళ్ళింది.ఇప్పుడు బాలీవుడ్ లో 'జుడ్వా 2' సినిమాలో బికినీల్లో సందడి చేయనున్న తాప్సీ.. తెలుగులో మాత్రం 'ఆనందో బ్రహ్మా' అనే హారర్ కామెడీతో వస్తోంది. మనుషులే దెయ్యాలను భయపెడితే అనే కాన్సెప్టుతో కనిపించనుంది. అయితే ఈ సినిమా తాప్సీకి ఎంతగా నచ్చేసిందట.. అమ్మడు తననే హీరోయిన్ గా పెట్టుకుని.. మిగతా స్టార్ క్యాస్ట్ ను మార్చేసి.. ఇదే దర్శకుడు మహి వి రాఘవ్ తో హిందీలో సినిమాను రీమేక్ చేద్దాం అనుకుంటోందట. అంటే సోలో హీరోయిన్ గా అక్కడ కంగన రనౌత్ విద్యా బాలన్ తరహాలో ప్రూవ్ చేసుకోవాలని కాబోలు.

ఇంకా తెలుగులోనే రిలీజై హిట్టు కొట్టని సినిమాను.. అప్పుడే బాలీవుడ్ కు తీసుకెళ్ధాం అనుకోవడం ఏంటి.. కామెడీ కాకపోతే. ఆగస్టు 18న ఆనందో బ్రహ్మ ఇక్కడ రిలీజవుతోంది.