ఫోటో స్టోరి: తాప్సీ బికినాయనమః

Wed Sep 13 2017 15:30:12 GMT+0530 (IST)

క్లాసులు సౌత్ ఇండస్ర్టీలకు.. బికినీలు బాలీవుడ్ వారికి.. అన్నట్లుంది రింగులు జుత్తు బ్యూటి తాప్సీ పన్ను పరిస్థితి. అమ్మడు ఇక్కడ కేవలం తనను గ్లామర్ డాల్ గా మాత్రమే చూశారని చెబుతూనే.. బాలీవుడ్ లో రెండు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాక ఇప్పుడు గ్లామర్ డాల్ గా చేయడానికి అవకాశం వచ్చిందని కూడా చెప్పింది. ఈ కామెంట్లలో ఉన్న ఆంతర్యం పసిగట్టడం కష్టమేమీ కాదు. టాలీవుడ్ లో ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా ఒకటే పేమెంట్ వస్తుంది.. బాలీవుడ్ లో అయితే బికినీ వేస్తే చాలా ఎక్కువగా దక్కుతుంది.అందుకే ఇప్పుడు త్వరలో రానున్న 'జుడ్వా 2' సినిమా కోసం అమ్మడు తానేంటే ఏంటో చూపించేస్తోంది. సాధారణంగా సౌత్ నుండి బాలీవుడ్  వెళ్ళి అవకాశాలు పొందిన భామలందరూ.. సినిమాల్లో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేయాలంటే కాస్త ఇబ్బంది పడ్డారు. తీరా వీరు టూ పీస్ వేస్తాం అని సిగ్నల్ ఇచ్చేసరికి.. అదేదో చిన్నా చితాకా హీరో సినిమాలో తప్పించి.. పెద్ద స్టార్ పక్కన టూ పీస్ వెయ్యడానికి అవకాశం రాక.. చివరకు బాలీవుడ్లో ఛాన్సులు  కోల్పోవాల్సి వచ్చింది.

అందుకే ఇప్పుడు తాప్సీ మాత్రం వరుణ్ దావన్ తో సినిమా అనగానే.. ఎన్ని బికినీలు కావాలంటే అన్ని వేసుకుంటానంటూ సంతకం పెట్టేసింది. చూస్తున్నారుగా.. మారిషస్ బీచ్ లో అమ్మడు ఒంటికి మట్టి అంటుకోగా.. అలా రెండు పీలికల బికినీలో మనకు ఫోజులు కొడుతోంది. బికినాయమః అంటూ నచ్చనివారే కళ్ళు మూసుకోవడమే. నచ్చితే తిలకించడమే. అంతకుమించి ఆప్షన్ ఏముంటుందిలే.