Begin typing your search above and press return to search.

తాప్సీ ప్లీజ్ న‌న్ను పెళ్లాడ‌వా?

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:49 AM GMT
తాప్సీ ప్లీజ్ న‌న్ను పెళ్లాడ‌వా?
X
తాప్సీ కెరీర్ బెస్ట్ ఫేజ్‌ ని - జాయ్‌ ఫుల్ లైఫ్‌ని లీడ్‌ చేస్తోంది. పింక్ - నామ్ ష‌బానా - ముల్క్ చిత్రాల‌తో గొప్ప న‌టి అన్న పేరు తెచ్చుకుంది. `జుడ్వా 2` చిత్రంతో వంద కోట్ల క్ల‌బ్ నాయిక‌గా వెలిగిపోయింది. ఇప్పుడు `మ‌న్మార్జియాన్` చిత్రంతో మ‌రోసారి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. పైగా ఈ దిల్లీ గాళ్ ఒరిజిన‌ల్ లైఫ్‌ కి ద‌గ్గ‌ర‌గా ఉన్న క‌థ‌తో అనురాగ్ క‌శ్య‌ప్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ట‌. గురుద్వారా బ్యాక్‌ డ్రాప్ ల‌వ్ స్టోరి.. పైగా ఇందులో తాప్సీ శిక్కు గాళ్‌ గానే నటించింది. శిక్కు కుర్రాళ్లుగా అభిషేక్ బ‌చ్చ‌న్ - విక్కీ కౌశ‌ల్ న‌టించారు.

అయితే ఈ సినిమాలోని ఓ స‌న్నివేశం పెనువివాదానికి కార‌ణ‌మైంది. శిక్కు అమ్మాయి తాప్సీ - శిక్కు అబ్బాయి అభిషేక్ ఇద్ద‌రూ గురుద్వార‌లో పెళ్లాడేందుకు వెళుతుంటారు. స‌రిగ్గా టెంపుల్‌ లో ప్ర‌వేశించే టైమ్‌ లో తాప్సీ గ‌త జ్ఞాప‌కాల్లోకి వెళుతుంది. అప్పుడు త‌న మాజీ ప్రేమికుడితో స్టోరీ ర‌న్ అవుతుంది. అయితే ఆ స‌న్నివేశంలో వ‌ధువు-వ‌రుడు సిగ‌రెట్లు తాగి గురుద్వార‌లో ప్ర‌వేశించ‌డం శిక్కుల్లో తీవ్ర ప్రకంప‌నాలు రేపింది. ప్ర‌స్తుతం దీనిపై కొన్ని శిక్కు వ‌ర్గాలు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా సీరియ‌స్ అవ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ఆస‌క్తిక‌రంగా ప‌లువురు శిక్కులు సామాజిక మాధ్య‌మాల్లో తాప్సీని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది తాప్సీ. అదే టైమ్‌ లో ఓ వీరాభిమాని ``న‌న్ను పెళ్లాడ‌తావా ప్లీజ్‌`` అంటూ ఊహించ‌ని ప్ర‌పోజ‌ల్ పెట్టాడు. అందుకు తాప్సీ కూల్‌ గా అంతే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. ``మ‌నం గురుద్వార‌లో పెళ్లి చేసుకోవాలంటే ముందు జ‌నం వ్య‌తిరేకించ‌కూడ‌దు. అప్పుడు మాత్ర‌మే పెళ్లి చేసుకుందాం. స‌రిగ్గా ఆ టైమ్‌ లోనే నేను నా మాజీ ల‌వ‌ర్‌ ని త‌లుచుకుంటాను.. నీకు ఓకేనా?`` అని సినిమాటిక్‌ గా ఆన్స‌ర్ చేసింది. ఈ ఆన్స‌ర్‌ తో స‌ద‌రు అభిమాని కంగు తినాల్సొచ్చింది. అదీ సంగ‌తి.