Begin typing your search above and press return to search.

సీక్రెట్ ఏజెంట్ మీరా.. ఇక రచ్చే

By:  Tupaki Desk   |   26 Aug 2016 10:30 PM GMT
సీక్రెట్ ఏజెంట్ మీరా.. ఇక రచ్చే
X
ఇప్పుడు కాలం కలిసొస్తే ఏమవుతుంది.. ఏముంది బ్యాక్ టు బ్యాక్ కత్తిలాంటి సినిమాలు చేతిలో పడతాయి. ప్రస్తుతం ఉంగరాల జుత్తు గంగ.. మన తాప్సీ పన్ను పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో గ్లామర్ డాల్ గా ఎంత కష్టపడినా కూడా రాని బ్రేక్.. అలాగే బాలీవుడ్ వెళ్ళిన ఏ సౌత్ హీరోయిన్ కు రాని బ్రేక్.. ఇప్పుడు ఈ ఢిల్లీ బెల్లీకి వచ్చేస్తోందనే చెప్పాలి.

''పింక్'' సినిమా ట్రైలర్ తో బాలీవుడ్ అంతటా తెగ పాపులర్ అయిపోయింది తాప్సీ. అమ్మడి యాక్టింగ్ ను మెచ్చుకోని వారే లేరనుకోండి. అయితే సినిమా ఈ నెలలో రిలీజవుతున్నప్పటికీ.. ఇప్పుడు తాప్సీకి కేవలం ట్రైలర్ చూసే సినిమా ఆఫర్లు తెగ వచ్చేస్తున్నాయి. గతంలో ''బేబి'' అనే సినిమాలో ఏజెంట్ మీరా అంటూ ఒక చిన్న పాత్రను చేసింది ఈ అమ్మడు. అప్పట్లో అది ఏముందిలో అనుకున్నాం కాని.. ఇప్పుడు ఆ పాత్రను సెంట్రల్ క్యారెక్టర్ గా మలచి దర్శకుడు నీరజ్ పాండే ఒక కథను తయారు చేశాడు. ఈ కొత్త కథను శివమ్ నాయర్ డైరక్షన్లో తాప్సీ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్నారు.

ఒక 'కహానీ' 'క్వీన్' తరహాలో తనకు ఇది సోలో ప్రాజెక్టు అంటూ తాప్సీ ఎంత మురిసిపోతోందో చూసుకోండి మరి. బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి ఒక రెండు మూడు సినిమాలు పడ్డాయంటే.. అమ్మడు కూడా ఒక విద్యా బాలన్ ఒక కంగనా రనౌత్ తరహాలో సెపరేట్ రేంజ్ హీరోయిన్ అయిపోదాం అనుకుంటోంది. అది సంగతి.