Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ టీవీ న‌టుడు అరెస్ట్‌..!

By:  Tupaki Desk   |   22 July 2018 4:53 AM GMT
ప్ర‌ముఖ టీవీ న‌టుడు అరెస్ట్‌..!
X
తెలుగు లోగిళ్ల‌లో చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా కొన్నేళ్ల పాటు టీవీల‌కు క‌ట్టి పారేసిన చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ గుర్తుందా? హిందీలో విజ‌య‌వంత‌మైన బాలికా వ‌ధు ను తెలుగులో డ‌బ్బింగ్ చేసి ప్ర‌సారం చేయ‌టం.. దీనికి భారీ స్పంద‌న రావ‌టం తెలిసిందే. ఈ సీరియ‌ల్ లో లీడ్ రోల్ చేసిన ప్ర‌ముఖ టీవీ న‌టుడు సిద్దార్ద్ శుక్లా తాజాగా అరెస్ట్ అయ్యారు.

ప‌లు హిందీ సీరియ‌ల్స్ లో న‌టించే ఇత‌గాడు త‌న ర్యాష్ డ్రైవింగ్ తో ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌య్యాడు. ఈ ప్ర‌మాదంలో ఇత‌డి కారుతో పాటు మ‌రో మూడు కార్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఒక‌రికి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. శ‌నివారం రాత్రి కారు న‌డుపుతున్న సిద్దార్ధ శుక్లా.. ఒక్క‌సారిగా ప‌ట్టు త‌ప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

నియంత్ర‌ణ కోల్పోయి కారు కార‌ణంగా ముందు వ‌స్తున్న కార్ల‌ను ఆయ‌న ఢీ కొట్టారు. అనంత‌రం ఒక క‌రెంటు స్థంభాన్ని ఢీ కొట్టారు. దీంతో.. సిద్ధార్ద్ శుక్లా కారు ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. సిద్ధార్ద్ ను అదుపులోకి తీసుకున్నారు.

కారు ప్ర‌మాద స‌మ‌యంలో ఆయ‌న తాగి ఉన్నారా? లేడా? అన్న విష‌యాన్ఇన తేల్చేందుకు వీలుగా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. మూడుకార్ల‌ను బ‌లంగా ఢీ కొట్టి.. క‌రెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన త‌ర్వాత కూడా కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా.. ఈ ప్ర‌మాదంలో ఈ టీవీ న‌టుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయ‌న పుణ్య‌మా అని రాజ్ కుమార్ దూదె అనే కారు య‌జ‌మాని మాత్రం స్వ‌ల్ప గాయాల‌య్యాయి.