Begin typing your search above and press return to search.

పవన్ తెర తీశారు -టీవీ9 రవి ప్రకాష్

By:  Tupaki Desk   |   18 March 2017 5:07 PM GMT
పవన్ తెర తీశారు -టీవీ9 రవి ప్రకాష్
X
కాటమరాయుడు ఆడియో ఫంక్షన్ కి వచ్చిన అనేక మంది అతిథుల్లో టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ కూడా ఉన్నారు. వచ్చింది సినిమా ఫంక్షన్ కి అయినా.. ఈయన ప్రధానంగా పవన్ రాజకీయాల గురించే మాట్లాడడం విశేషం.

'పవన్ కళ్యాణ్ ని ఇష్టపడుతున్నవ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. మొన్నటి ఎన్నికల్లో పవన్ పోషించిన పాత్ర ఏంటో అందరికీ తెలుసు. వేరే వ్యక్తి అయితే.. అందుకు ప్రతిఫలంగా ఏదో పదవి తీసుకునేవారు. లేదా డబ్బులు పొందడం చేసేవారు. ప్రస్తుతం రాజకీయ నాయకుల్లాగా కాకుండా.. పవన్ మాత్రం కొత్త మార్గం ఎంచుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి.. పవన్ తన శక్తి మేరకు కృషి చేస్తున్నారు. అందుకే పవన్ ని ఖచ్చితంగా అభిమానించాలి' అన్నారు రవి ప్రకాష్.

'కొత్త సంస్కృతికి పవన్ తెర తీశారు. ఈరోజు అధికారంలో ఉన్నవారికి ప్రభుత్వంలో ఉన్నవారికి.. వందిమాగధుల్లా తయారై భజన చేసే బ్యాచ్ ప్రతీ చోటా కనిపిస్తున్నారు. ఈ రోజు నిజం మాట్లాడ్డం చాలా కష్టమైన విషయం. ఆ పని చేస్తనన్నపవన్ కి అభినందనలు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆశపెట్టి.. మోసం చేసిన సందర్భంలో కావచ్చు. డీమానిటైజేషన్ సమయంలో ప్రజలను రోడ్డున పడేసినప్పుడు కావచ్చు. అందరూ మౌనంగా ఉన్నప్పుడు ప్రశ్నించిన వ్యక్తి పవన్' అంటూ పవన్ పై తన అభిమానం ఎలాంటిదో చెప్పారు రవి ప్రకాష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/