దర్శకుల్ని ఇబ్బంది పెడుతున్న యంగ్ హీరో

Mon Jul 17 2017 15:27:29 GMT+0530 (IST)

హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో హీరోలు చెప్పందే వేదం చేసిందే చట్టం. టాలీవుడ్ రోజు రోజుకి మారుతుందని ఆనందించే టైమ్ లో కూడా కొందరు హీరోలు తమ ట్రాక్ మారడం లేదు. స్టార్ హీరోలు - ఓల్డ్ హీరోలే మారుతున్న ట్రెండ్ కి తగ్గట్లుగా వారికి వారిని మార్చుకుంటూ ఉంటే ఇప్పడిప్పుడే కెరీర్ గ్రాఫ్ ని పెంచుకుంటున్న కొందరు కుర్ర హీరోలు మాత్రం తమ మిడిమిడి జ్ఞానంతో దర్శకనిర్మాతల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారట. ఈ బ్యాచ్ లో మీడియం ఏజ్ కి దగ్గరైన ఓ కుర్ర హీరో ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ ఆ తరువాత ఓ మాస్ మసాల సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన ఆ యంగ్ హీరోగారు తన మార్కెట్ 40 కోట్లనే వూహల్లో ఉన్నాడట దీంతో తన బిజినెస్ కి తగ్గట్లుగానే సినిమాలు కూడా గ్రాండియర్ గా ఉండాలని తనతో ప్రస్తుతం సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతల పై ప్రెజర్ పెడుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఆ హీరోగారు చెప్పింది కాదనలేక రోజురోజుకి పెరిగిపోతున్న ప్రొడక్షన్ బడ్జెట్ ను కంట్రోల్  చేయలేక ఫైనాన్సులు కోసం నిర్మాతలు పరుగులు పెడుతున్నారని టాక్. ఏదో ఫ్లూక్ హిట్స్ తో తన కెరీర్ గ్రాఫ్ పెంచుకున్న ఆ హీరోగారు ఇలాగే కొనసాగితే ప్రస్తుతం తను కమిటైన సినిమాలు తరువాత తెరమరుగుకి దగ్గరయ్యే సూచనలు ఉంటాయని ఫిల్మ్ సర్కిల్స్ మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి ఆ హీరో ఇప్పటికైన కళ్లు తెరిచి తను కుర్చున్న కొమ్మను నరుక్కోకుండా ఉంటాడేమో చూడాలి.