తారక్ సినిమా నాదే: తమన్

Fri Feb 23 2018 17:21:14 GMT+0530 (IST)

గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీకి సంగీత దర్శకుడు ఎవరు అనే దాని గురించి తీవ్ర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి టైంలోనే హారికా హాసిని సంస్థకు అనిరుద్ తో రెండు సినిమాలకు ఒప్పందం జరిగిందని అందుకే అతనే తారక్ సినిమాకు కూడా మ్యూజిక్ ఇవ్వొచ్చని ఒక వార్త షికారు చేసింది. కాని దీని గురించి మాట్లాడడానికి నిర్మాత చినబాబుతో సహా టీంలో ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆ ఊహాగానాలు అలాగే కొనసాగాయి. దేవి శ్రీ ప్రసాద్ పేరు కూడా కొద్ది రోజులు వినిపించింది. తమన్ అన్నారు కాని ఖచ్చితంగా చెప్పేవారు లేరు. వీటికి టోటల్ గా ఫుల్ స్టాప్ పెడుతూ తమన్ స్వయంగా ఓపెన్ అయిపోయాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్-జూనియర్ ఎన్టీఆర్ కలయికలో మొదటిసారి వస్తున్న మూవీకి సంగీతం అందించడం ఎంతో ఆనందంగా ఉందన్న తమన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో ఇది రూపొందబోతోందని యంగ్ టైగర్ ఫాన్స్ ని ఊరిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాకు తమన్ ఇంతవరకు పని చేయలేదు. చల్ మోహనరంగా కు ట్యూన్స్ ఇచ్చాడు కాని దానికి త్రివిక్రమ్ రచన ప్లస్ సహ నిర్మాత మాత్రమే. సో ఈ లెక్కన తమన్ కు ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది. మార్చ్ రెండో వారంలో మొదలు కానున్న షూటింగ్ తో జూనియర్ బిజీ అయిపోతాడు.

త్రివిక్రమ్ తో మొదటిసారి కాని జూనియర్ తో మాత్రం తమన్ కు ఇది మొదటి సారి కాదు. బాద్షా రామయ్య వస్తావయ్య రభస ఈ కాంబినేషన్ లో వచ్చాయి. ఇది నాలుగోది అవుతుంది. భాగమతి - తొలిప్రేమ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తమన్ మంచి జోరు మీదున్నాడు. రానున్న క్రేజీ ప్రాజెక్ట్స్ అధిక శాతం ఇతని ఖతాలోనే ఉండటం తమన్ జోరుని చెప్పకనే చెబుతోంది.