Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ టాక్‌: తీన్‌ అదిరిపోయిందిగా..

By:  Tupaki Desk   |   5 May 2016 4:54 PM GMT
ట్రైలర్‌ టాక్‌: తీన్‌ అదిరిపోయిందిగా..
X
ఎనిమిది సంవత్సరాల క్రితం.. కలకత్తాలో.. జాన్‌ బిస్వాస్‌ (అమితాబ్‌ బచ్చన్) మనవరాలిని ఎవరో కిడ్నాప్‌ చేశారు. పోలీసులు ఎంత వెతికినా.. ఆమె దొరకలేదు. సరిగ్గా ఇప్పుడు మరో కిడ్నాప్‌ జరిగింది. మళ్లీ అదే రకంగా. సరితా సర్కార్ (విద్యా బాలన్‌) అనే ఇన్సపెక్టర్‌.. ఇప్పుడు ఈ రెండు కేసులనూ సోధించాలని చూస్తోంది. ఇక ఈ కేసును సాల్వ్ చేయలేక పోలీసు ఉద్యోగం వదిలేసి చర్చి ఫాథర్‌ గా మారిపోయిన.. మార్టిన్‌ (నవాజుద్దీన్‌ సిద్దికీ) ఇప్పుడు జాన్‌ తో కలసి ఇదే కేసును ప్రైవేట్‌ గా ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నారు. ట్రైలర్‌ ప్రకారం మనకు తెలిసే ''తీన్‌'' స్టోరీ ఇది.

పాత్రల తీరుతెన్నులూ.. ఈ అద్భుత నటుల యాక్టింగ్‌.. దర్శకుడు రిభూ దాస్‌గుప్తా కొన్ని సీన్లు తెరకెక్కించిన విధానం.. అబ్బురపరిచాయంతే. మన దగ్గర మొన్న వచ్చిన ''క్షణం'' సినిమా చూసి ఎలా థ్రిల్‌ కు గురయ్యామో.. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ చూసి కూడా అలా ఫీలవ్వాల్సిందే. అమితాబ్‌ యాక్టింగ్‌ అయితే టాప్‌ నాచ్‌ అని చెప్పాలి. అలాగే నవాజుద్దీన్‌ కూడా ఇరగదీశాడు. ఇక విద్యా బాలన్ గురించి చెప్పేదేముంది. మొత్తానికి చాలా కాలం తరువాత బాలీవుడ్‌ లో మళ్లీ థ్రిల్లర్‌ సినిమా వస్తోంది. అది సంగతి.

జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా ''తీన్‌'' సినిమా విడుదలవ్వనుంది.