Begin typing your search above and press return to search.

రెడ్డి గారి మెగా-పవర్ ప్రాజెక్టు ఉందట

By:  Tupaki Desk   |   29 May 2017 8:22 AM GMT
రెడ్డి గారి మెగా-పవర్ ప్రాజెక్టు ఉందట
X
తెలుగు సినిమా​కు తెలుగు ప్రజలకు ​ఇద్దరు అన్నదమ్ములు బంధం ఎప్పటికీ గుర్తుంటుంది. ఒకరు మెగాస్టార్ చిరంజీవి మరొకరు పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్. వీళ్ళు కలిసి ఒక చోట ఉంటేనే అభిమానులు పండుగ చేసుకుంటారు మరి వీళ్ళు ఇద్దరు కలిసి సినిమా చేస్తే మొత్తం టాలీవుడ్ కు కొన్ని ఏళ్లకు సరిపడా వేడుక దొరికినట్లే.

వీళ్ళకు కథ రాయాలి అంటే రాసేవాడికి గొప్ప ప్రతిభ ఉండాలి నిర్మించేవాడికి సత్తా ఉండాలి. ఆ రెండు దండిగా ఉన్న పెద్ద నిర్మాత గొప్ప డైరెక్టర్ దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకరు ప్రముఖ నిర్మాత రాజకీయవేత్త బిజినెస్ మాన్ అయిన టి సుబ్బరామి రెడ్డి అయితే.. మరొకరు తెలుగు మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ మధ్యనే సుబ్బరామి రెడ్డి గారు త్రివిక్రమ్ – పవన్ షూటింగ్ సెట్ కు వెళ్ళి కలిసి మాట్లాడారట. చిరంజీవి పవన్ కల్యాణ్ డేట్స్ బట్టి ఈ ప్రాజెక్టు లాంచ్ అవుతుంది దీని కోసం అన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేశాం అని సుబ్బిరామి రెడ్డి తెలిపారు.

ఇప్పుడు పవన్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. అటు చిరు కూడా తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు. దాని తరువాత ఈ మెగా పవర్ ప్రాజెక్టు లాంచ్ కావచ్చు. ఇదే నిజం అయితే తెలుగు లో గొప్ప సినిమాగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కాని మ్యాటర్ ఏంటంటే.. అసలు ఈ న్యూస్ పలుమార్లు వినిపిస్తున్నారు కాని.. నిజంగా పవన్ కళ్యాణ్‌ అన్నయ్యతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడా అనేదే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/