Begin typing your search above and press return to search.

కుర్ర‌హీరోల‌పై పెద్దాయ‌న మ‌ళ్లీ ఏసేశారు!

By:  Tupaki Desk   |   16 Sep 2019 11:09 AM GMT
కుర్ర‌హీరోల‌పై పెద్దాయ‌న మ‌ళ్లీ ఏసేశారు!
X
పారిశ్రామిక‌వేత్త‌గా.. రాజ‌కీయ నాయ‌కుడిగా .. గొప్ప ఆధ్యాత్మిక వేత్త‌గా ఆయ‌న‌లో ఉన్న‌న్ని కోణాలు ఎవ‌రిలోనూ లేవు. సినీనిర్మాత‌గానూ పాపుల‌ర్. ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికీ ఆప్తుడిగా క‌ళాబంధుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్-ఏఎన్నార్-చిరంజీవి స‌హా నేటిత‌రం హీరోల‌తోనూ ఆయ‌న ఎంతో స‌న్నిహితంగా ఉంటారు. ఇండియాలోని అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల‌తో అనుబంధం క‌లిగి ఉన్న ఏకైక‌ క‌ళాబంధువు ఆయ‌న‌. అంత‌టి పెద్దాయ‌న ప‌దే ప‌దే కుర్ర హీరోల‌కు క్లాస్ తీస్కోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఆయ‌న ఎక్క‌డ హ‌ర్ట‌య్యారో కానీ.. ఒక పాయింట్ మాత్రం ప‌దే ప‌దే హైలైట్ చేస్తుండ‌డం ప్ర‌స్తుతం ఫిలింవ‌ర్గాల్లో వేడెక్కిస్తోంది. ఇంత‌కీ ఆయ‌నెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాలా? ది గ్రేట్ టి.సుబ్బ‌రామిరెడ్డి అలియాస్ టీఎస్సార్. ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్ పార్క్ హ‌య‌త్ య‌జ‌మాని.

సెప్టెంబ‌ర్ 17 ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ కుర్ర‌హీరోల‌పై ఫైర‌య్యారు. జీవితంలో అన్నీ సాధించినా గ‌ర్వం లేదు. వ్య‌క్తిగ‌తంగా ఇలానే ఉంటానని అంటున్న ఆయ‌న‌.. టాలీవుడ్ యువ‌హీరోల తీరుతెన్నుల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. అస‌లు మీరు క‌ళాబంధు ఎలా అయ్యారు? అని ప్ర‌శ్నిస్తే.. భ‌గ‌వంతుని సృష్టిలో ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక క‌ళ ఉంటుంది. 24 క‌ళ‌లు క‌లిసి సినిమాగా చూస్తాం. ప్ర‌పంచం మ‌ర్చిపోయి సినిమా చూస్తాం. అస‌లు సినిమాని బీట్ చేసేదే లేదు. సినిమా క‌ళాకారులు దైవానికి సంబందీకులు అని చెబుతాను. దైవానికి సంబంధం ఉన్న‌వాళ్లు క‌ళాకారులు. వారితో క‌లిసి ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని తెలిపారు.

క‌ళాకారులు ఎలా ఉండాలి? అన్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చేస్తూ.. దైవ‌సంబంధీకులు అంటే మంచి మ‌నుషులుగా ఉండాలి. కొంత‌మంది నేటి జ‌న‌రేష‌న్ లో డౌన్ టు ఎర్త్ లేకుండా కొంచెం అహంకారంతో ఉన్నారు. ఆకాశంలోంచి ఊడిప‌డ్డామ‌నుకుంటున్నారు. ఏ హీరో అయినా.. సుదీర్ఘ‌కాలం మెప్పు పొందాలి అంటే ఒదిగి ఉండాలి. ఏఎన్నార్ - ఎన్టీఆర్ ద‌శాబ్ధాల పాటు వెలిగారంటే .. వారి క్ర‌మ‌శిక్ష‌ణ‌.. ప‌బ్లిక్ తో ఒదిగి ఉండే స్వ‌భావం.. అంద‌రితో క‌ల‌వ‌డం వ‌ల్ల‌నే. చిరంజీవి కూడా ఎన్టీఆర్- ఏఎన్నార్ ని అనుస‌రిస్తారు. అద్భుత‌మైన స్టార్. ఈ జ‌న‌రేష‌న్ లో ఆయ‌నే గొప్ప స్టార్. ప్ర‌స్తుత‌ జ‌న‌రేష‌న్ అంతా ఎన్టీఆర్ ఏఎన్నార్ చిరంజీవిని అనుస‌రించాల‌ని నేను చెబుతాను. రాజ‌కీయ నాయ‌కుడిగా .. పారిశ్రామిక వేత్త‌గా.. క‌ళాకారుడిగా .. నిర్మాత‌గా ఇన్ని ర‌కాలుగా రాణించిన‌ నేను ఇన్ని క్వాలిటీస్ ఉండి చెబుతున్నాను... అని విరుచుకుప‌డ్డారు.

టీఎస్సార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వైజాగ్ లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌కు `అభిన‌య మ‌యూరి` పుర‌స్కారాన్ని అందిస్తున్నారు. బ‌హుశా ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌కు కుర్ర హీరోల్ని ఆహ్వానిస్తే కుద‌ర‌ద‌ని చెప్పారా? అంటూ ఒక‌టే ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఇటీవ‌లే ఆ ఈవెంట్ క‌ర్టెన్ రైజ‌ర్ వేడుక‌లో మాట్లాడుతూ.. అవార్డుల‌కు పిలిస్తే హీరోలు రావ‌డం లేద‌ని ఆయ‌న సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఇలా దొరికిన ప్ర‌తిచోటా ప‌బ్లిక్ వేదిక‌ల‌పైనే చెడామ‌డా క‌డిగేస్తున్నారు.