సరసుడు మరో మన్మధ అవుతుంది

Wed Sep 13 2017 19:00:01 GMT+0530 (IST)

తమిళ సినిమా రంగంలో నటుడిగానే కాకుండా దర్శకుడిగా గాను అలాగే రచయితగాను మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి టి. రాజేందర్. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అప్పుడప్పుడు తన గాత్రంతోను మెప్పిస్తూ ఉంటాడు. అలాగే ఆయన కుమారుడు శింబు కూడా సినిమా రంగంలో హీరోగా మంచి గుర్తింపు పొందుతున్న సంగతి తెలిసిందే. వీరికి తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా సంబంధాలు బాగానే ఉన్నాయి.అయితే శింబు - నయనతార ప్రధానపాత్రలుగా టి.రాజేందర్ తెరకెక్కించిన సరసుడు అనే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సందర్బంగా ఆయన కొన్ని విషయాలని మీడియాతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ..  సినిమా అనేది భారీ బడ్జెట్ తో తెరకెక్కినంత మాత్రాన ప్రేక్షకులు చూడరు. సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకులతో ఆయనకు ప్రత్యేక సంబంధం ఉందని తెలిపారు. తాను నటించిన ప్రేమ సాగరం సినిమా తెలుగులో ఏడాది ఆడిందని గుర్తు చేశారు.

ఇక సరసుడు సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటుందని మన్మధ - వల్లభ సినిమా రేంజ్ లో ఉంటుందని చెప్పారు. ఇక యూత్ కి నచ్చే విధంగా ఈ సినిమాలో సీన్స్ ఉంటాయని తెలుపుతూ.. సినిమాలో కొన్ని పాటలను తాను పాడినట్లు తెలిపాడు. ఈ సినిమాకు తన చిన్న కుమారుడు కరల్ సంగీతం అందించారని సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులు నచ్చుతుందని టి.రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.