యాక్షన్ సూపర్ స్టార్ పై రేపు కేసు..

Thu Jun 14 2018 14:44:11 GMT+0530 (IST)

హాలీవుడ్ లో యాక్షన్ సూపర్ స్టార్  సిల్వస్టర్  స్టాలోన్ అంటే తెలియని వారుండరు.. అలాంటి స్టార్ ఇప్పుడు రేపు కేసుతో చిక్కుల్లో పడ్డాడు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన రేప్ ఘటనలో ఇప్పుడు ఓ మహిళ తాజాగా స్టాలోన్ పై  ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదై.. కోర్టులో విచారణ కొనసాగుతోంది.1976లో ‘రాకీ’ చిత్రంతో స్టాలోన్ హాలీవుడ్ లో ప్రవేశించాడు. యాక్షన్ హీరోగా ఎదిగాడు. అయితే లైంగిక దాడులపై గళం విప్పుతూ మొదలైన ‘మీటూ’ ఉద్యమం స్ఫూర్తితో మహిళలంతా తమకు జరిగిన అన్యాయాలపై గళం విప్పుతున్నారు. 8 నెలలుగా హాలీవుడ్ లో మహిళలందరూ తమపై జరిగిన ఆకృత్యాలను వివరిస్తున్నారు. ఆ కోవలోనే స్టాలోన్ చేతిలో మోసపోయిన మహిళా ఇన్నాళ్లకు కేసు పెట్టింది.

ఎప్పుడో 1990లో లైంగిక దాడి చేశాడని హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వస్టర్  స్టాలోన్ (71)పై ఇప్పుడు కేసు తిరగదోడడం తాజాగా అనుమానాలకు తావిస్తోంది.. ఈ మేరకు లాస్ ఎంజిల్స్ జిల్లా కోర్టు ప్రతినిధి బుధవారం కేసు రీఓపెన్ అయినట్టు ప్రకటించారు. స్టాలోన్ పై 1990లో లైంగిక దాడికి పాల్పడ్డాడని తాజాగా బుధవారం ఓ మహిళ కేసు పెట్టింది. 27 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులకు ఇప్పుడు ఫిర్యాదు అందడం.. అది కోర్టు వరకూ ఎక్కడం వార్తల్లో నిలిచింది.. ఈ విషయమై స్టాలోన్ ప్రతినిధులు కూడా స్పందించారు. ఆయన తరఫు న్యాయవాది మార్టిన్ సింగర్ మాట్లాడుతూ ‘డిసెంబర్ లో స్టాలోన్ పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఫిర్యాదుపై విచారణ చేపట్టామని సాంటా మోనికా పోలీసులకు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్టాలోన్ న్యాయ పోరాటం చేస్తారని’ పేర్కొన్నారు.