రంగస్థలంలో మెగా స్టార్ ఎంట్రీ

Wed May 16 2018 10:14:42 GMT+0530 (IST)

రంగస్థలం మూవీతో ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఎనభైల నాటి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీ రిలీజయి 45 రోజులు దాటినా ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారంటే ఈ సినిమా స్టామినా తెలిసిపోతుంది. ఈ మూవీలో నటీనటుల టాలెంట్ తోపాటు రంగస్థలం గ్రామ సెట్ కు కూడా బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చింది.హైదరాబాద్ శివార్లలో వేసిన రంగస్థలం గ్రామ సెట్ ఇప్పటికీ తీయకుండా అలాగే ఉంచారు. మెగాస్టార్ 151వ సినిమా సైరా.. నరసింహారెడ్డి మూవీలో కొంత భాగం రంగస్థలం సెట్ లో చిత్రీకరించనున్నారు. బ్రిటీష్ వారితో పోరాడి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీతో సైరా తెరకెక్కుతోంది. ఇది కూడా గ్రామీణ నేపథ్యంతో సాగే సినిమానే. ఇందులో కొన్నిసీన్లు పల్లెటూరులో చిత్రీకరించాల్సి ఉంది. ఇందుకు పాతకాలం నాటి ఇళ్లతో ఉండేలా వేసిన రంగస్థలం సెట్ సరిగ్గా సరిపోతుంది. ఇళ్లలో కొన్ని మార్పుచేర్పులు చేసి సైరా షూటింగ్ కోసం వినియోగించనున్నారు.

సాధారణంగా తండ్రి సాధించిన విజయాలు కొడుకుకు ఉపయోగపడటం మామూలే. కానీ కొడుకు సాధించిన విజయం తండ్రికి ఉపయోగపడటం అంటే సూపరనే చెప్పాలి. తన కొడుకు గెలిచిన చోట నిలబడి నటించడమంటే చిరంజీవికి గ్యారంటీగా సంతోషం కలిగిస్తుందనే చెప్పాలి. ఇప్పటికి సైరా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు రెండో షెడ్యూట్ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే రంగస్థలం సెట్ లో మార్పుచేర్పులు చేసి షూటింగ్ చేయబోతున్నారు.