Begin typing your search above and press return to search.

'సైరా' టాకీ ఎట్ట‌కేల‌కు సంపూర్ణంగా..

By:  Tupaki Desk   |   24 Jun 2019 2:12 PM GMT
సైరా టాకీ ఎట్ట‌కేల‌కు సంపూర్ణంగా..
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఖైదీనంబ‌ర్` 150 రిలీజై ఇప్ప‌టికే ఏడాది పైగానే అయ్యింది. 2017 సంక్రాంతికి ఆ సినిమా రిలీజైంది. బాస్ రీఎంట్రీలో అద‌ర‌గొట్టేశారు. అయితే ఆ త‌ర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని వేచి చూసి కానీ మెగాస్టార్ తిరిగి మ‌రో సినిమాకి సంత‌కం చేయ‌లేదు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ వారి `ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి` క‌థ‌కు ఓకే చెప్పి సురేంద‌ర్ రెడ్డి దర్శ‌క‌త్వంలో ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 200కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ఉయ్యాల‌వాడ తొలి స్వాతంత్య్ర‌ స‌మ‌రయోధుడు .. అత‌డి క‌థ‌లో వీర‌త్వాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఓవైపు సురేంద‌ర్ రెడ్డితో పాటు మ‌రోవైపు టెక్నిక‌ల్ టీమ్ అంతే ఇదిగా శ్ర‌మిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు సంపూర్ణంగా షూటింగ్ పూర్త‌య్యింది. ప్యాచ్ వ‌ర్క్‌- పాట‌లు స‌హా పాట‌లు- టాకీ చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ఈ సంగ‌తిని సైరా సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా వెల్ల‌డించారు. ``సైరా షూటింగ్ పూర్త‌యింది. మా బృందంలో ప‌ని చేసిన‌ ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. అంద‌రూ చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. ఇది మ‌ర్చిపోలేని జ‌ర్నీ. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డిఐ వ‌ర్క్ కూడా మొద‌లైంది`` అని వివ‌రాల్ని అందించారు. మెగాస్టార్ ఇప్ప‌టికే శ‌బ్ధాల‌యాలో డ‌బ్బింగ్ ప‌నులు ప్రారంభించారు.

ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్‌- విజ‌య్ సేతుప‌తి- కిచ్చాసుదీప్‌- జ‌గ‌ప‌తిబాబు- అనుష్క‌- త‌మ‌న్నా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న సినిమా రిలీజ్ కానుంది. డెడ్ లైన్ ప్ర‌కారం ప‌నుల‌న్నీ పూర్తి చేసేందుకు సూరి- చర‌ణ్ బృందం పక‌డ్భందీగా ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌ని చేస్తున్నార‌ట‌.