Begin typing your search above and press return to search.

ఫ్లాష్ ఫ్లాష్: సైరా ఈవెంట్ వాయిదా ?

By:  Tupaki Desk   |   16 Sep 2019 11:01 AM GMT
ఫ్లాష్ ఫ్లాష్: సైరా ఈవెంట్ వాయిదా ?
X
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నరసింహ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ 18న ఎల్బి స్టేడియంలో జరుగుతుందని గత కొద్దిరాజులుగా చెప్పుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా అప్ డేట్ ప్రకారం దీన్ని వాయిదా వేసే ఛాన్స్ ఎక్కువగా ఉందట. ఈ నెల 22కి షిఫ్ట్ చేసే ఆలోచనలో చరణ్ టీమ్ ఉన్నట్టుగా వినికిడి. అధికారిక ప్రకటన మరికొద్ది గంటల్లో రావొచ్చు. దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

ఎల్లుండి భాగ్యనగర వాతావరణం అంత అనుకూలంగా లేదు. వర్షం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్టేడియం లాంటి ఓపెన్ ప్లాట్ ఫార్మ్ అయితే ఇబ్బందులు తప్పవు. అందుకే దానికి బదులుగా 22 డేట్ అనుకూలంగా భావిస్తున్నట్టు సమాచారం. మరో కారణం 18 బుధవారం వర్కింగ్ డే. రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు తరలి రావడం అంత ఈజీ కాదు. రెండు రోజులు త్యాగం చేసుకుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అదే 22 అయితే వీకెండ్ కాబట్టి సాఫీగా జరిగిపోతుంది. మరి వేదిక కూడా మారుస్తారా లేదా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. నిన్న శ్రేయాస్ మీడియా ఎల్బి స్టేడియంలో ఏర్పాట్ల కోసం పూజా కార్యక్రమాలు చేసింది కాని ఆ తర్వాతే ఈ ట్విస్టులన్నీ తెలిశాయట. మెగా ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అయినప్పటికీ ఆదివారం ఈవెంట్ ప్లాన్ చేస్తే కనక ఊరట కలిగించినట్టే. అఫీషియల్ నోట్ వచ్చాక పూర్తి స్పష్టత వస్తుంది