Begin typing your search above and press return to search.

సైరాకి పోటీ షురూ అయ్యింది

By:  Tupaki Desk   |   15 July 2019 8:06 AM GMT
సైరాకి పోటీ షురూ అయ్యింది
X
పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ లో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీస్ ని బాలీవుడ్ నిర్మాతలు మరీ సీరియస్ గా తీసుకుంటున్నట్టు లేరు. ఇప్పటికే సాహో మీద అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ జాన్ అబ్రహం బాట్లా హౌస్ పోటీకి సై అనగా అక్టోబర్ 2 రావాలని ఫిక్స్ అయిన సైరా నరసింహారెడ్డి మీద కాంపిటీషన్ కి హృతిక్ రోషన్-టైగర్ శ్రోఫ్ ల వార్ మూవీ రెడీ అవుతోంది. ఇందాకే విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ బ్లాక్స్ చూసి అభిమానులు బాప్రే అనుకుంటున్నారు.

యాష్ రాజ్ సంస్థ కాబట్టి నిర్మాణ విలువలు హాలీవుడ్ రేంజ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి. టైటిల్ లోనే యుద్ధం అని చెప్పేశారు కాబట్టి అవుట్ అండ్ అవుట్ భీభత్సమైన ఫైట్లతో వార్ రచ్చ చేయబోతుందన్న మాట. అసలు ట్విస్ట్ దీన్ని సౌత్ లాంగ్వేజెస్ తెలుగు-తమిళ్ లో కూడా డబ్ చేయబోతున్నారు. సైరాకు దీనికి థీమ్ పరంగా ఎలాంటి కనెక్షన్ లేకపోయినా పెద్ద మార్కెట్ ని టార్గెట్ చేసుకుని విడుదల కానున్న సైరాకు నార్త్ లో వార్ నుంచి చిక్కులు రావొచ్చు.

పైగా దానికి భారీ నిర్మాణ సంస్థ అండదండలు ఉండటంతో స్క్రీన్ కౌంట్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. నిజానికి సైరా డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ ఆ డేట్ మినహా మరో ఆప్షన్ లేదు. అది మిస్ చేసుకుంటే సంక్రాంతి దాకా ఛాన్స్ ఉండదు. సో సైరా ఎలాంటి అనుమానం లేకుండా వార్ తో పోటీ పడాల్సిందే. చూస్తుంటే మనకు ధీటుగా బాలీవుడ్ క్రేజీ చిత్రాలను పోటీలో దింపుతున్నట్టుగా ఉంది ఈ పోకడ చూస్తుంటే. ఈ క్లాష్ లో మొదటి సిరీస్ ఆగస్ట్ 15న సాహోకు ఎదురు కానుంది. చూడాలి ఎలాంటి ఫలితాలు వస్తాయో