Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పాట మైండ్ బ్లోయింగ్

By:  Tupaki Desk   |   20 Sep 2017 7:51 AM GMT
ఎన్టీఆర్ పాట మైండ్ బ్లోయింగ్
X
ఇండియన్ బెస్ట్ సింగర్స్ లో ఒకరైన నేహా భాసిన్.. గతేడాది రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ మూవీలో యాపిల్ బ్యూటీ పాటను పాడింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఎన్టీఆర్-సమంతలపై తెరకెక్కిన ఆ పాట ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరో సెన్సేషన్ తో వచ్చేస్తున్నారు ఈ కాంబో. స్వింగ్ జర అంటూ మరోసారి నేహా భాసిన పాడిన పాట సెన్సేషన్ అవుతోంది.

ఎన్టీఆర్-తమన్నాలపై తెరకెక్కించిన ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. అతి తక్కువ సమయంలోనే 4 మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి. ఐటెం సాంగ్ అనే విషయం ముందే తెలిసినా.. నేహా భాసిన్ పాడే సరికి ఈ పాటకు ప్రత్యేకత వచ్చేసింది. ఇలాంటి ఎనర్జిటిక్ పాటను తాను ఈ మధ్య కాలంలో పాడలేదని.. ఈ ట్రాక్ విన్నప్పటి నుంచి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానని చెప్పిన నేహా భాసిన్.. ఆన్ స్క్రీన్ పై ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది. అయితే.. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ ను చూసిన తర్వాత.. దానికి ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణ చూశాక.. ఈ ఏడాది బెస్ట్ హిట్స్ గా నిలుస్తుందనే తన నమ్మకం మరింతగా పెరిగిందని చెబుతోంది నేహ.

దేశీయ ఎనర్జీకి.. మోడర్న్ టచ్ ఇస్తూ ఈ సాంగ్ కంపోజ్ చేశానని రాక్ స్టార్ డీఎస్పీ అంటున్నాడు. అయితే.. తెలుగు పాటలు పాడడంలో తను ప్రతీ సారీ కొంత భయపడుతుంటానని.. అందుకే డిక్షన్ పై ఎక్కువగా దృష్టి పెడతానని చెప్పింది నేహా భాసిన్.