Begin typing your search above and press return to search.

సినిమాల మీద స్వామిజీ సెటైర్లు

By:  Tupaki Desk   |   11 Jan 2019 11:35 AM GMT
సినిమాల మీద స్వామిజీ సెటైర్లు
X
కాదేది కవితకు అనర్హం అన్నారో మేధావి. అదే రీతిలో కారెవరు సినిమా వీక్షణకు అనర్హం అనేలా ఈ ,మధ్య కాలంలో అధిక శాతం పబ్లిక్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి సాక్ష్యంగా అంతకంతా పెరుగుతూ పోతున్న మల్టీ ప్లెక్స్ సంస్కృతిని ఉదాహరణగా చెప్పొచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే టీవీలో కనిపించాలనే ఉద్దేశంతో మొదటి ఆట పూర్తవ్వగానే మైకుల ముందుకు వచ్చి ఛానల్స్ లో కనిపించాలని తాపత్రయపడే వాళ్ళకూ కొదవ లేదు. ఇప్పుడు కొత్తగా విభిన్న వర్గాలకు చెందిన వాళ్ళు కూడా బెనిఫిట్ షోలకు రావడం విశేషం.

మాములుగా సినిమాలకు దూరంగా ఉంటూ దైవత్వమే లోకంగా ఉండే స్వామిజీలు సైతం ప్రసాద్ ఐమాక్స్ లో ఉదయం మొదటి ఆటకే ప్రత్యక్షం కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అలా అని చెప్పి గుట్టుగా చూసి వెళ్ళిపోవడం లేదు. నిష్కర్షగా తమ అభిప్రాయాలను మైకు ముందు గడగడ చెప్పేస్తున్నారు. ఇవాళ విడుదలైన వినయ విధేయ రామ మీద ఓ స్వామిజీ తన మనసులో మాటలు చెప్పడం గమనార్హం. సినిమా అస్సలు బాలేదని నిజ జీవితంలో ఏ మాత్రం సాధ్యం కాని అర్థం లేని హీరోయిజంతో బోయపాటి శీను చెడగొట్టేసాడని రంగస్థలం తర్వాత రావాల్సిన మూవీ కాదని తేల్చి చెప్పేశారు.

అంతే కాదు నందమూరి కొణిదెల ఈ రెండు కుటుంబాల వల్ల ఒకరి సినిమాను ఒకరు దుమ్మెత్తి పోసుకుని ప్రేక్షకులు రాకుండా చేసుకుని ఒకరకంగా పైరసీని ప్రోత్సహించడానికి కారణం అవుతున్నారని సరికొత్త విశ్లేషణ చేయడం అందరికి షాక్ కి గురి చేసింది. సినిమాకు సంబంధం లేని వేరే టాపిక్ మొదలుపెట్టిన స్వామిజీ కొందరికి ఇంగ్లీష్ లో సైతం ఫీడ్ బ్యాక్ ఇవ్వడం గమనార్హం.