Begin typing your search above and press return to search.

మాజీ వైఫ్.. హృతిక్ ఎపిసోడ్ తేల్చేసింది

By:  Tupaki Desk   |   2 May 2016 5:30 PM GMT
మాజీ వైఫ్.. హృతిక్ ఎపిసోడ్ తేల్చేసింది
X
బాలీవుడ్ లో నెలన్నరకు పైగా సాగిన ఓ బ్రేకప్ ఎపిసోడ్ కి ఈ మధ్యనే తెరపడింది. హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ ల మధ్య నెలకొన్న విబేధాలపై ఇప్పుడు ఏ అప్ డేట్స్ రావడం లేదు. ఇకపై ఈ విషయాన్ని ప్రైవేట్ గా డీల్ చేసుకుంటామని, పబ్లిక్ గా ఎలాంటి ప్రకటనలు చేయబోమని కంగనా స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ఇలా కంగనా స్టేట్ మెంట్ కు ముందు.. హృతిక్ మాజీ వైఫ్ చేసిన కామెంట్స్ కీలకం అయ్యాయి.

కంగనా అందించిన ప్రూఫ్స్ అన్నీ ఫోటోషాప్ బాపతేనని హృతిక్ రోషన్ మాజీ భార్య తేల్చేయడంతో.. కంగనా ఎపిసోడ్ కీలక మలుపు తీసుకుంది. ఆ తర్వాత సద్దుమణిగినా ఈ వ్యవహారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సుసానే ఖాన్.. దాదాపుగా ఎపిసోడ్ కి చెక్ పెట్టింది. దీనికి తోడు ఈ మధ్య పిల్లలను తీసుకుని సుసానే ఓ అబ్రాడ్ టూర్ వెళ్లింది. అక్కడకు హృతిక్ కూడా అటెండ్ కావడంతో.. వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు దీనిపై కూడా సుసానే ఓ క్లారిటీ ఇచ్చేసింది.

"నేను ప్రజలందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. హృతిక్ తో కలిసి జీవితం అనేది జరగదు. కానీ.. మేం మంచి పేరెంట్స్ - మా తొలి ప్రాధాన్యం పిల్లలే" అంటూ సుసానే ఖాన్ ట్వీట్ చేయడంతో.. మాజీ భార్యాభర్తలు కలవనున్నారనే ఎపిసోడ్ కి చెక్ పడినట్లయింది. హృతిక్ విషయంలో వచ్చిన రెండు రకాల ఎపిసోడ్స్ కు.. మాజీ వైఫ్ సుసానే స్వయంగా చెక్ చెప్పడం విశేషం.