Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్‌... నిజ‌మేనా?!

By:  Tupaki Desk   |   28 July 2015 5:02 AM GMT
ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్‌... నిజ‌మేనా?!
X
మెగా హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ ల‌తో క‌లిసి న‌టించిన కాజ‌ల్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ తోనూ జోడీ క‌ట్టాల‌ని ఎప్ప‌ట్నుంచో ఎదురు చూస్తోంది. కొన్నిసార్లు ఆ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయింది. ఇక ఈసారి మాత్రం వీరిద్ద‌రి జోడీ ప‌క్కా అని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌వ‌న్‌ కళ్యాణ్ క‌థానాయ‌కుడి గా న‌టిస్తున్న గ‌బ్బ‌ర్‌ సింగ్ సీక్వెల్ `స‌ర్దార్‌`లో క‌థానాయిక‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ ని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తొలుత ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్‌ ని హీరోయిన్‌ గా ఫిక్స్ చేశారు. ప‌వ‌న్‌, అనీషాల‌పై ఫొటోషూట్‌ లు కూడా చేశారు. కానీ కొన్నికార‌ణాల వ‌ల్ల అనీషాని సినిమా నుంచి త‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది.

ప‌వ‌న్‌కి త‌గ్గ‌ట్టుగా ఓ స్టార్ హీరోయిన్‌ ని ఎంపిక చేసుకోవాల‌ని చిత్ర‌బృందం కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చివ‌రికి ఆ అవ‌కాశాన్ని కాజ‌ల్‌ కి ఇచ్చార‌నీ, ఇటీవ‌లే చిత్ర ద‌ర్శ‌కుడు బాబీ, కాజ‌ల్ మ‌ధ్య క‌థ గురించి డిస్క‌ష‌న్స్ కూడా జ‌రిగాయ‌ని తెలిసింది. ఈ నెల 29 నుంచి సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతోంది. ఈ షెడ్యూల్ నుంచి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ షూటింగ్‌ లో పాల్గొన‌బోతున్నాడు. ప‌వ‌న్‌ తో పాటు హీరోయిన్ కూడా సెట్స్‌ కి వ‌స్తుంద‌ట‌. సో... ఆ రోజే సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది తేలిపోనుంది. చిత్ర‌బృందం మాత్రం అటు సినిమా పేరు గురించి కానీ, ఇటు హీరోయిన్ గురించి కానీ బ‌య‌ట‌కి చెప్ప‌డం లేదు.

త‌న సొంత సంస్థ‌లో తెర‌కెక్కుతున్న `స‌ర్దార్‌`కోసం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స్వ‌యంగా మ‌రాఠీ న‌టుడు శ‌ర‌ద్ కేల్క‌ర్‌ ని ఎంపిక చేశారు. స్క్రిప్టు విష‌యంలో ప‌వ‌న్ ప్ర‌త్యేకమైన చొర‌వ తీసుకొంటున్న‌ట్టు తెలుస్తోంది. `గోపాల గోపాల‌`కి మాట‌లు రాసిన బుర్రా సాయిమాధ‌వ్‌ ని పిలిపించి స్క్రిప్టు కి తుదిమెరుగులు దిద్ద‌మ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. `గ‌బ్బ‌ర్‌ సింగ్‌ 2` అంటూ అభిమానులు ఎప్ప‌ట్నుంచో మాట్లాడుకొంటున్నారు. ఆ సినిమా పై చాలా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగా ఉండాల‌ని సినిమాపై ప‌వ‌న్ చాలా కేర్ తీసుకొంటున్న‌ట్టు తెలుస్తోంది.