Begin typing your search above and press return to search.

న‌టి కిడ్నాప్ కేసులో మ‌రో కీల‌క అరెస్ట్‌!

By:  Tupaki Desk   |   22 Feb 2017 10:24 AM GMT
న‌టి కిడ్నాప్ కేసులో మ‌రో కీల‌క అరెస్ట్‌!
X
దేశ‌వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం రేపిన మ‌ళ‌యాళ హీరోయిన్ కిడ్నాప్ కేసులో మ‌రిన్ని కీల‌క మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే మ‌ళ‌యాళ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కు పాత్ర ఉంద‌న్న విష‌యం సంచ‌ల‌నం రేకెత్తించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచార‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేర‌ళ పోలీసులు నేటి ఉద‌యం మ‌రో కీల‌క వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. ఈ వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యం అంత‌గా తెలియ‌న‌ప్ప‌టికీ... అత‌డు త‌ల‌దాచుకున్న స్థలం విష‌యం సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌ణికించేలానే ఉంది.

మ‌ళ‌యాళ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ యువ హీరోకు చెందిన ఇంటిలో స‌ద‌రు వ్య‌క్తి త‌ల‌దాచుకున్నాడ‌ని, ప‌క్కా స‌మాచారం అంద‌డంతో సద‌రు ఇంటిపై దాడి చేసిన పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయినా అరెస్ట్ అయిన వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యం అంత‌గా ప్ర‌స్తావ‌న‌కు రాకున్నా.. అత‌డు త‌ల‌దాచుకున్న విష‌యాన్నే పోలీసులు కీల‌కంగా ప‌రిగ‌ణిస్తున్న నేప‌థ్యంలో స‌ద‌రు ఇంటి యజ‌మానిగా ఉన్న యంగ్ హీరోకు చిక్కులు త‌ప్ప‌వ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ కేసుతో స‌ద‌రు యంగ్ హీరోకు సంబంధం లేకుంటే... ఆ వ్య‌క్తికి ఎందుకు ఆశ్ర‌య‌మిస్తార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు కిడ్నాప్ కేసులో యంగ్ హీరో ప్ర‌మేయం ఏ మేర‌కు ఉంద‌న్న విష‌యంపై మ‌రింత లోతుగా ఆరా తీస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇదిలా ఉంటే... కిడ్నాప్‌ న‌కు గురైన హీరోయిన్‌ కు సంబంధించిన జ‌ర్నీ వివ‌రాల‌ను నిందితుల‌కు చేర‌వేసిందెవ‌ర‌న్న కోణంలో ద‌ర్యాప్తు చేసిన పోలీసుల‌కు కాస్తంత షాకిచ్చే స‌మాచార‌మే చిక్కిన‌ట్లు తెలుస్తోంది. స‌ద‌రు హీరోయిన్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్ర యూనిట్‌ కు చెందిన యూనిట్ స‌భ్యుడేన‌ని కూడా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌టి కిడ్నాప్ వ్య‌వ‌హారంలో మ‌రింత మేర ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూసే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/