మీటూ : దర్శకురాలిపై దర్శకుడు దావా

Fri Oct 19 2018 15:56:52 GMT+0530 (IST)

ఒకవైపు మహిళలు సెలబ్రెటీలపై లైంగిక దాడి ఆరోపణలు చేయడం జరుగుతుంటే మరో వైపు ఎంతో మంది సెలబ్రెటీలు తపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ పరువుకు భంగం వాటిల్లేలా చేస్తున్నారంటూ పరువు నష్టం దావా వేస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. తాజాగా తమిళ దర్శకుడు సుశీ గణేశన్ కూడా యాడ్ ఫిల్మ్ దర్శకురాలు లీనా మణిమేఘపై పరువు నష్టం దావా వేశాడు.మహిళ దర్శకురాలు మణి మేఘ ఇటీవల దర్శకుడు సుశీ గణేశన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తాను సుశీ గణేశన్ తో కారులో వెళ్తున్న సమయంలో ఆయన నా పట్ల అనుచితంగా ప్రవర్తించి నన్ను లైంగికంగా వేదించాడు అంటూ ఆరోపించింది. సుశీ గణేశన్ పై ఇంకా పలు ఆరోపణలను ఆమె చేయడం జరిగింది. లీనా మణిమేఘ లైంగిక ఆరోపణలపై దర్శకుడు సుశీ గణేశన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు.

తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన లీనా పై ఆన్ లైన్ ద్వారా సుశీ గణేశన్ ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో పరువు నష్టం దావా కూడా వేసినట్లుగా తెలుస్తోంది. ఆమె నా వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేయాలని ఆశించింది అందుకు నేను నో చెప్పడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నాడు. ఆమె చేసిన ఆరోపణల వల్ల తాను మనస్తాపానికి గురైనట్లుగా పేర్కొన్నాడు. తనపై ఆమె చేసిన ఆరోపణలను నిరూపించాలని లేదంటే కోర్టు ఆమెను శిక్షించాల్సిందిగా దావాలో పేర్కొన్నాడు. సుశీ గణేశన్ వేసిన పరువు నష్టం కేసు ఈనెల 22వ తేదీన విచారణంకు రాబోతుంది. సుశీ గణేశన్ కేసుపై లీనా కూడా సీరియస్ గానే స్పందించింది. ఆయన్ను తాను లీగల్ గానే ఎదుర్కొంటానంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.