ఖైదీ కోసం కూతురు!! వాటే స్టైలింగ్

Thu Jan 12 2017 09:21:38 GMT+0530 (IST)

మెగాస్టార్ కం బ్యాక్.. అదిరిపోయింది. ఖైదీ నంబర్ 150తో చిరంజీవి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చేశారు. 61 ఏళ్ల వయసులో చిరంజీవి ఏం చేయగలడు? అనే యాంగిల్ లో వినిపించిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క సినిమాతో వంద సమాధానాలు చెప్పారు మెగాస్టార్. అసలు ఈ మూవీకి అన్నిటి కంటే మెయిన్ హైలైట్ చిరు లుక్స్ అనడంలో ఏ మాత్రం సందేహ పడాల్సిన అవసరం లేదు.

60ప్లస్ ఏజ్ లో కనీసం తన వసయు కంటే 20 ఏళ్లు తక్కువగా కనిపించడం ఈ మూవీలో అన్నిటికంటే పెద్ద హైలైట్. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ అయితే.. మూవీ అయితే మాస్ రచ్చతో ఇరగదీసేశారంతే. మాస్ సన్నివేశాల్లో అయినా.. పాటల్లో అయినా.. రొమాంటిక్ సీన్స్ అయినా.. మెగాస్టార్ కాస్ట్యూమ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇదంతా చిరంజీవి కూతురు సుశ్మిత చేసిన మ్యాజిక్. కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ఈమె.. తండ్రి కోసం స్వయంగా తనే రంగంలోకి దిగింది. ప్రతీ సన్నివేశంలోనూ మెగాస్టార్ లుక్ మెమరబుల్ గా ఉండిపోయేలా డిజైన్ చేసింది.

హీరో హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ లో కూడా సుశ్మిత ట్యాలెంట్ ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ప్రారంభంలోనే వచ్చే ఐటెం సాంగ్ లో లక్ష్మీ రాయ్ కి డిజైన్ చేసిన డ్రస్సుల్లో కూడా ఏ మాత్రం వల్గారిటీ లేకుండా.. గ్లామర్ గా చూపించడంలో సుశ్మిత స్టైలింగ్ సూపర్ అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/