ఫోటో స్టోరీ: సుష్ జజ్జినకర జనారే

Fri Oct 12 2018 18:36:13 GMT+0530 (IST)

మాజీ విశ్వసుందరి సుశ్మితాసేన్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఈ భామ కింగ్ నాగార్జున సరసన `రక్షకుడు` సినిమాలో నటించింది. సుష్ డేరింగ్ యాటిట్యూడ్ - యాక్టింగ్ స్టైల్ యూత్ కి నచ్చినా ఎందుకనో ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. దాంతో ఆ తర్వాత సుశ్మితాసేన్ టాలీవుడ్ వైపు చూసిందే లేదు. ఆ క్రమంలోనే బాలీవుడ్ లో మాత్రం కెరీర్ పరంగా బిజీ అయ్యింది.సల్మాన్ ఖాన్ - షారూక్ - అమీర్ - అమితాబ్ - గోవిందా - దేవగన్ లాంటి బడా స్టార్ల సరసన పలు చిత్రాల్లో నటించింది. దశాబ్ధ కాలం కెరీర్ ని సాగించినా నవతరం వెల్లువలో అక్కడా స్టార్ డమ్ ని నిలబెట్టుకోవడంలో తడబడింది. చింగారి లాంటి ప్రయోగాత్మక చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది. అయితే పర్సనల్ లైఫ్ లో సుష్ తీసుకున్న ఓ డేరింగ్ నిర్ణయం మాత్రం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. తాను జీవితాంతం ఓ అవివాహితగానే ఉండిపోతానని - పురుషాధిక్య ప్రపంచంతో ఎగ్జిస్ట్ కాలేనని - తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉందని ప్రకటించి పెద్ద షాకిచ్చింది. ఆ క్రమంలోనే కొందరు చిన్నారుల్ని దత్తతకు తీసుకుని పెంచి పోషిస్తోంది.

అదంతా ఓ కోణం అనుకుంటే వేరొక కోణంలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో సుష్ ఓ కింగ్ మేకర్. విశ్వసుందరిగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకు ఉన్న అనుభవాన్ని రంగరించి ఈ రంగంలో ఎందరినో తయారు చేసేందుకు సొంతంగా ఫ్యాషన్ శిక్షణ ఇనిస్టిట్యూట్ ని స్థాపించింది. ముంబై నగరం సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా సుష్ స్టూడెంట్స్ అక్కడ తప్పనిసరిగా పెర్ ఫామ్ చేస్తుంటారు. అయితే ఇదిగో ఇటీవలే ఓ ఈవెంట్ లో తాను కూడా ఇలా చిలకాకుపచ్చ డిజైనర్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేస్తూ తళుక్కుమంది. చిరునవ్వుల హంసరాణి తలకు చుట్టిన ఆ రాజస్థానీ స్టైల్ తలపాగా సంథింగ్ స్పెషల్‌గా ఆకట్టుకుంటోంది. జ్యోతి ముఖర్జీ & భూమిక డిజైనర్ షోలో షో స్టాపర్ గా నిలిచింది సుశ్మితాసేన్. తొలితరంలో ర్యాంప్ వాక్ లకు వన్నె తెచ్చిన మేటి సుందరీమణి సుశ్మితాసేన్.