Begin typing your search above and press return to search.

చిన్న పిల్లతో హీరోయిన్ బికినీ డ్యాన్స్

By:  Tupaki Desk   |   27 March 2017 12:30 PM GMT
చిన్న పిల్లతో హీరోయిన్ బికినీ డ్యాన్స్
X
సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ ఉంది చూశారూ.. ఆమె తన అందచందాలతో వెండితెరను ఊర్రూతలూగించడమే కాదు.. ఆ తరువాత హీరోయిన్ గా సైడ్ అయిపోయాక తన స్టేట్మెంట్లతో కూడా పిచ్చెక్కిస్తోంది. అంతే కాదు.. ఇద్దరు పిల్లలను అనాథ శరణాలయం నుండి దత్తతు చేసుకున్న సుస్మిత.. వారిని కన్న కూతుళ్లకంటే ఎక్కువగా చూసుకుంటుంది. వారితో కలసి ఫారిన్ టూర్లకు వెళుతూ.. ఫెమినిజం గురించి.. స్ర్తీ స్వాతంత్ర్యం గురించి చాలా చెబుతోంది అమ్మడు.

గత రాత్రి.. అమ్మడు తన 12 ఏళ్ళ కూతురు రెనీతో ఒక స్టెప్పు.. 7 ఏళ్ళ కూతురు అలీసాతో ఒక స్టెప్పు వేస్తూ.. ఒక వీడియోను రిలీజ్ చేసింది. ప్రముఖ పాప్ సింగర్ ఎడ్‌ షెరాన్ కంపోజ్ చేసిన 'షేప్ ఆఫ్‌ యు' అనే పాటను వాడుకుంటూ.. అమ్మడు చిన్న కూతురుతో కలసి బికినీ వేసుకుని డ్యాన్స్ చేస్తున్న ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియోను చూసినోళ్లందూ సుస్మిత తను బికినీలో మెరవడమే కాకుండా.. కూతుళ్లతో కూడా అలా చేయిస్తూ.. షేప్ ఆఫ్‌ యు.. అంటూ ఒక ఇన్ డైరెక్ట్ మెసేజ్ ఇస్తోందని అందరూ పొగిడేస్తున్నారు.

''కూర్చోవడం.. లేదా డ్యాన్స్ చేయడం.. అంటూ రెండు ఆప్షన్లు ఇస్తే.. ఖచ్చితంగా నేను డ్యాన్స్ చేస్తాను'' అంటూ చెప్పుకొచ్చింది సుస్మిత. కాకపోతే ఇంతటి సెక్సీ అందాన్ని.. అలాగే టాలెంటెడ్ నటిని.. బాలీవుడ్ ఎందుకు విస్మరించిందో ఎవ్వరికీ అర్ధంకాని ఒక ప్రశ్న!!





Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/