Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః ఇంత హాట్ తెలుగమ్మాయా??

By:  Tupaki Desk   |   17 Aug 2017 12:38 PM GMT
ఫోటో స్టోరిః ఇంత హాట్ తెలుగమ్మాయా??
X
తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు కాకపోవడానికి ప్రధాన కారణం సెక్సీ ఉండకపోవడం అనేది అందరి అభిప్రాయం. మనం ఎక్కువగా కమర్షియల్ సినిమాలే నిర్మిస్తాం కాబట్టి ఆ కమర్షియల్ విలువలకు సరిపడే అందాలు మన తెలుగు అమ్మాయిలలో ఉండవిని అసలు తెలుగు హీరోయిన్ కోసం వెతికే పనికూడా పెట్టుకోరు మన ఇండస్ట్రి వాళ్ళు. అయితే అప్పుడుప్పుడు మన అమ్మాయిలు కూడా తన అందాలుతో మెప్పించిన ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకోవలిసి వస్తుంది. స్వాతి రెడ్డి లాంటి తెలుగు అమ్మాయిలుకు కూడా మన తెలుగులో కన్నా తమిళంలో మలయాళంలో మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఒక తెలుగు అమ్మాయి తన కమర్షియల్ బ్రేక్ ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తుంది.

తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ‘మాయ’ సినిమాలో ను అలానే సునిల్ హీరోగా చేసిన ‘వీడు గోల్డ్ ఎహే’ సినిమాలో హీరోయిన్ గా చేసిన సుష్మా రాజ్ ఇప్పుడు తన బాడీని పూర్తిగా ఫిట్ గా మార్చి ఇలా అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు వస్తున్న అందరి హీరోయిన్లు వాళ్ళ బాడీ పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఒక్కొక్కరు నాలుగు ఐదు గంటలు జిమ్ పోటీపడి మరీ చేస్తున్నారు. సుష్మా రాజ్ బాడీ ని చూస్తే ఈమె కచ్చితంగా తెలుగు అమ్మాయి కాదు అనేస్తారు. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఇంత ఫిట్ గా ఉండరనేది మన నమ్మకం కాబట్టి. మబ్బులు ముసురుతున్న వేల ఇలా తన జిమ్ డ్రెస్స్ తో ఆరుబయట ధీమాగా ఒళ్ళు విరుచుకుంటుంది. తెలుగు అమ్మాయే కానీ బెంగళూరు లో పెరగడం వలన ముందు ఒక కన్నడ ఫిల్మ్ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక్కడ ఈమె సొగసు చూస్తే కమర్షియల్ హీరోయిన్ కన్నా ఈమె కు ఏమి తక్కువ అనిపిస్తుంది. మనకు అనిపిస్తే సరిపోతుందా చెప్పండి. మాయ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఆ తరువాత తెలుగులో మంచి ఆఫర్లు రాలేదు.