Begin typing your search above and press return to search.

సావిత్రిలో నటించే ధైర్యం చేస్తాడా!?

By:  Tupaki Desk   |   24 March 2017 5:08 PM GMT
సావిత్రిలో నటించే ధైర్యం చేస్తాడా!?
X
మహానటి సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించేదుకు టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్ధమయ్యాడు. ఏడాదికి పైగా ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పటికే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను.. జమున రోల్ కోసం సమంతను ఎంపిక చేశాడు దర్శకుడు. ఇప్పుడీ చిత్రంలో మేల్ లీడ్ రోల్స్ ఎవరు నటిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

టాలీవుడ్ కి సంబంధించినంత వరకూ ఎన్టీఆర్.. ఏఎన్నార్ ల రోల్స్ పై ఆసక్తి కనిపిస్తుంటే.. ఇప్పుడు శివాజీ గణేశన్ పాత్రలో ఎవరు కనిపించనున్నారనే విషయంపై ఓ స్పష్టత వస్తోంది. ఈ పాత్రను తమిళ హీరోతో చేయించాలని భావించిన దర్శకుడు.. సూర్యను సంప్రదించాడట. అయితే.. సావిత్రి బయోపిక్ ను యథాతథంగా తెరకెక్కిస్తే.. జెమినీ గణేశన్ పాత్రను నెగిటివ్ గా చూపించాల్సి వస్తుందనే విషయం ఓపెన్ సీక్రెట్. అలాంటి రోల్ ను చేయడం అంటే.. తమిళనాడులో కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే. అందుకే ఈ రోల్ విషయంలో తన అభ్యంతరాలు చెప్పడంతో పాటు.. తాను సూచించిన కొన్ని మార్పులు చేస్తేనే నటిస్తానని చెప్పాడట సూర్య.

మరి సూర్య కోసం నాగ్ అశ్విన్ స్టోరీని మారుస్తాడా.. లేక తన స్క్రిప్ట్ నే నమ్ముకుని సూర్యకు బదులుగా వేరే హీరోను అప్రోచ్ అవుతాడా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకి క్యాస్టింగ్ ను ఏప్రిల్ చివరకు పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/