Begin typing your search above and press return to search.

ఈనెల 17న సూర్య సినిమా ఆడియో

By:  Tupaki Desk   |   5 Oct 2015 5:12 AM GMT
ఈనెల 17న సూర్య సినిమా ఆడియో
X
సూర్య సినిమా అంటే సూర్య హీరోగా నటిస్తున్న సినిమా అనుకునేరు. ఈ మధ్యన అతనో నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాడుగా దానికి సంబంధించినదే ఈ కబురు. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి కొంతకాలమైనా ఇంకా ఆడియో - సినిమా విడుదల విషయంలో మాత్రం బండి ముందుకు కదలనే లేదు. ఇప్పుడిప్పుడే దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్టు చెన్నై వర్గాల సమాచారం.

2009లో పసంగ (పిల్లలు అని అర్థం) అనే బాలల సినిమాని తన తొలి సినిమాగా తీసి హిట్ కొట్టాడు తమిళ దర్శకుడు పాండిరాజ్. ఈ సినిమాతో పలు ప్రాంతీయ, జాతీయ అవార్డులను సైతం అందుకున్నాడు ఈ దర్శకుడు. మరోసారి అలాంటి కథతోనే ఇప్పుడు సినిమా చేస్తున్నారు. తొలుత ఈ సినిమా పేరును హైకూ అనుకున్నప్పటికీ ఇప్పుడు పసంగ2 గా మార్చినట్టు సమాచారం.అమలాపాల్ - బిందుమాధవి కీలక పాత్రల్లో కనపడనున్న ఈ సినిమాలో సూర్య అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారు. కొద్ది కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 17న విడుదల కానుంది. సినిమాని అతి త్వరలో తెరమీదికి తీసుకొచ్చే పనిలో సూర్య వున్నారట.