Begin typing your search above and press return to search.

జల్లికట్టుపై సూర్యకి పెటా కౌంటర్!!

By:  Tupaki Desk   |   19 Jan 2017 4:40 AM GMT
జల్లికట్టుపై సూర్యకి పెటా కౌంటర్!!
X
జల్లికట్టును వ్యతిరేకిస్తున్న పెటా చేసిన పోరాటం.. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ క్రీడను నిషేధించడం జరిగిపోయాయి. అయితే.. తమిళనాడు వాసులు మాత్రం జల్లికట్టును సమర్ధిస్తూ.. తమ సాంప్రదాయాలకు అడ్డు పడ్డానికి వీల్లేదంటున్నారు. స్టార్ హీరోలు కూడా జల్లికట్టును సమర్ధిస్తూ మాట్లాడగా.. తాజాగా కోలీవుడ్ హీరో సూర్య కూడా పెటాపై ఆరోపణలు చేస్తూ.. జల్లికట్టుకు మద్దతు పలికాడు.

సూర్య చేసిన కామెంట్స్ పై ఇప్పుడు పెటా రియాక్ట్ అయింది. సూర్య ఇప్పటికిప్పుడు జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడ్డం అంటే.. అది కేవలం జనాల సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికే అని.. దాని ద్వారా తన లబ్ధి చూసుకుంటున్నాడని పెటా వర్గాలు అంటున్నాయి. ఈ నెల 26న సూర్య నటించన సింగం సీక్వెల్ ఎస్3(సి3) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 'సూర్య ఇప్పుడు జల్లికట్టును సమర్ధిస్తూ మాట్లాడ్డం.. ఎస్3 రిలీజ్ సమయానికి ముందు మాట్లాడ్డం.. రెండూ యాదృచ్ఛికం కాదు. కేవలం తన సినిమా ప్రమోషన్స్ కోసం జనాలను రెచ్చగొడుతున్నాడు' అంటూ పెటా వర్గాలు విరుచుకుపడ్డాయి.

సినిమా పబ్లిసిటీ కోసం జల్లికట్టుకును సూర్య ఉపయోగించుకుంటున్నాడన్న పెటా ఆరోపణలు.. ఫ్యాన్స్ కు విపరీతంగా కోపం తెప్పించాయి. అయితే.. ఈ అంశంపై సూర్య ఇంకా స్పందించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/