Begin typing your search above and press return to search.

ఆ ఛీప్ ప‌బ్లిసిటీ నాకు అవ‌స‌రం లేదు!

By:  Tupaki Desk   |   21 Jan 2017 12:18 PM GMT
ఆ ఛీప్ ప‌బ్లిసిటీ నాకు అవ‌స‌రం లేదు!
X
త‌మిళ‌నాడు అంతా జ‌ల్లిక‌ట్టుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అన్ని వ‌ర్గాల వారూ సంప్ర‌దాయ క్రీడ‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. త‌మిళ సినిమా ప‌రిశ్ర‌మ అంతా ముక్త‌కంఠంతో జ‌ల్లిక‌ట్టుకు స‌పోర్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే, ప‌లువురు ప్ర‌ముఖ త‌మిళ న‌టులు స్పందించారు. మూగ జీవాల సంర‌క్ష‌ణ సంస్థ పెటాను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిన్న‌టికి నిన్న‌... పెటా నుంచి గ‌తంలో అవార్డు పొంద‌డం త‌న‌కు అవ‌మానంగా ఉందంటూ స్టార్ హీరో ధ‌నుష్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య హీట్ త‌గ్గ‌క‌ముందే... ఇప్పుడు హీరో సూర్య మ‌రో అడుగు ముందుకేసి ఆ సంస్థ‌కు ఏకంగా నోటీసులు పంపించాడు. పెటా స‌భ్యులు చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆవేద‌న‌కు గురిచేస్తున్నాయ‌నీ మాన‌సిక వేద‌న‌ను క‌లిగిస్తున్నాయ‌నీ వెంట‌నే వారు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.

సూర్య న‌టించిన సింగం - 3 త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. తన సినిమా విడుద‌ల ఉంది కాబ‌ట్టే జ‌ల్లిక‌ట్టుకు సూర్య మ‌ద్ద‌తు ప‌లికాడంటూ పెటా స‌భ్యులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సూర్య త‌ర‌ఫు న్యాయ‌వాది విజ‌య్ ఆనంద్ స్పందించారు. జ‌ల్లిక‌ట్టుకు సూర్య మ‌ద్ద‌తు తెల‌ప‌డానికీ, సింగం-3 విడుద‌ల‌కూ ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న కొట్టిపారేశారు. పైగా, ఇలాంటి ప్ర‌చారయావ సూర్య‌కు లేద‌నీ, చీప్ ప‌బ్లిసిటీ కోరుకోవాల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కు లేద‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. సూర్య‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ పెటా ఇండియా సీయీవోపాటు మ‌రో ఇద్ద‌రు స‌భ్యులకు సూర్య నోటీసులు పంపించ‌డం ఇప్పుడు త‌మిళ‌నాట కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఈ నేప‌థ్యంలో పెటా ఇండియా ఎలా స్పందిస్తుంద‌నేది వేచి చూడాలి. త‌మిళ‌నాట పెటాపై నెమ్మ‌దిగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మౌతోంది. ఈ ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయో మ‌రి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/