Begin typing your search above and press return to search.

స్టార్ హీరో మెచ్చిన సింప్లిసిటీ సీఎం!

By:  Tupaki Desk   |   20 Jan 2017 4:45 PM GMT
స్టార్ హీరో మెచ్చిన సింప్లిసిటీ సీఎం!
X

స్టార్ హీరో సూర్య ఒక సీఎం నిరాడంబరతను చూసి ఆశ్చర్యపోయారు. అంతేనా... సీఎం అంటే ఇలానే ఉండాలంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతకూ ఈ స్టార్ హీరో మెచ్చిన సీఎం ఎవరంటారా... కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్. అవును ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ "సి - 3" ప్రమోషన్ లో భాగంగా సుర్య కేరళలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కొచ్చి నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు సూర్య ఎక్కిన విమానంలో కేరళ చీఫ్ మినిస్టర్ విజయన్ ఎక్కారు. అయితే ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ఏ హంగూ ఆర్భాటం లేకుండా ఒక్కడే వెళ్లి ఎకానమీ క్లాస్‌ సీట్లో కూర్చోవడం, దీన్ని చూసిన సూర్య ఆశ్చర్యపోవడం ఒకేసారి జరిగిపోయాయట.

ఈ క్రమంలో తన సీటు వద్ద నుంచి లేచి వెల్లి సీఎంతో కరచాలనం చేసిన సూర్య అనంతరం మీడియాతో మాట్లాడారు.. విమానంలో తనకు ఎదురైన అనుభవం గురించి వివరించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాసులో ప్రయాణించడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఇదే సమయంలో చెకింగ్ పాయింట్ వద్ద కూడా క్యూలైన్ లోనే వేచి ఉండటం గొప్ప విషయమని సూర్య ప్రశంసించారు. తనకున్న సీఎం హోదాను ఉపయోగించుకుని చెకింగ్ పాయింట్‌ ను బీట్ చేసి వెళ్లే అవకాశం ఆయనకు ఉన్నప్పటికీ ఆ పనిచేయలేదని సూర్య చెప్పారు. ఒక వీవీఐపీ హోదాలో ఉన్న వ్యక్తి ప్రయాణికులందరూ దిగే వరకు వేచి చూసి చివరగా వెళ్లడం అంత మామూలు విషయం కాదని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సింప్లిసిటీ సీఎం విజయన్‌ ను చూసి ఇతర రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలన్నారు సూర్య అభిప్రాయపడ్డారు.

కాగా, సూర్య నటించిన ఎస్‌–3 చిత్రానికి ఇటీవలే సీ-3గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకు జంటగా అనుష్కతో పాటు శ్రుతి హాసన్‌ నటించారు. హరి దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా నిర్మించగా, హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించారు. పూర్తి కమర్షియల్‌ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/