Begin typing your search above and press return to search.

24.. విక్రమ్‌ 2.. సూర్య 4.. అదీ లెక్క

By:  Tupaki Desk   |   6 May 2016 1:42 PM GMT
24.. విక్రమ్‌ 2.. సూర్య 4.. అదీ లెక్క
X
ఈరోజు విడుదలైన ''24'' సినిమాను మాంచి స్పందన వస్తోంది. ఎవరు చూసినా కూడా అద్భుతం అంటున్నారు. హాలీవుడ్‌ కు ఆన్సర్‌ చెప్పే సత్తా మన ఇండియన్‌ దర్శకుల్లో ఉందంటూ తన గ్రాండ్‌ స్కేల్‌ సత్తాతో రాజమౌళి ప్రూవ్‌ చేస్తే.. ఇప్పుడు మనకు ఆ రేంజు ఇంటెలిజెన్స్‌ కూడా ఉందంటూ విక్రమ్‌ కె కుమార్‌ ప్రూవ్‌ చేశాడు.

ఇకపోతే ఈ సినిమా చూడని వారికి 24 అంటే మీనింగ్‌ ఏంటో చెప్పట్లేదు మేం. మీరు చూసే తెలుసుకోండి. అయితే 24 అంటే ఇప్పుడు ఫిలిం ఎనలిస్టులు ఇంకో మీనింగ్‌ చెబుతున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ కె కుమార్‌ రెండు పాత్రలు చేశారు. ఒకటి దర్శకుడు. ఇంకోటి రచయిత. ఇద్దరూ కలసి టైటిల్‌ లో ఉన్న '2' అనే ఆ సంఖ్యకు అర్ధంగా నిలిచారు. అలాగే '4' అనే ఆ సంఖ్యకు సూర్య అర్ధంగా నిలిచాడు. ఎందుకంటే మనోడు సినిమాలో నాలుగు పాత్రలు చేశాడు. ఒకటి సైంటిస్టు.. ఇంకోటి అతని కొడుకు.. ఇంకోటి విలన్‌ ఆత్రేయ.. మరి నాలుగోది? అదేనండీ.. ప్రొడ్యూసర్‌ గా బీభత్సమైన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ అంటే ఏంటో చూపించాడుగా. అది కూడా ఒక కీలక పాత్రే మరి.

ఏదేమైనా కూడా.. ఇలా ఒక డైరక్టర్‌ అండ్‌ హీరో కాంబినేషన్‌ లో సొంత ప్రొడక్షన్‌ లో సినిమాలు చేయాలనే ట్రెండ్‌ ఇక పెరిగిపోవచ్చు. మహేష్‌ - చరణ్‌ వంటి స్టార్లు కో-ప్రొడక్షన్‌ చేస్తుంటే.. సూర్య తానే ఫుల్‌ ప్రొడక్షన్‌ చేశాడు. అదీ లెక్క.