ఇద్దరు స్టార్ బ్రదర్స్.. ఒక మల్టీస్టారర్

Wed Jun 13 2018 23:00:02 GMT+0530 (IST)

మల్టీస్టారర్ కథలంటే ఎవరికీ ఇష్టం ఉండవు. ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఒకే తెరపై ఇద్దరు హీరోలు కనిపిస్తే అభిమానులు చాలా ఆనందపడిపోతారు. సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా మాములుగా ఉండదు. అయితే సినిమాల్లో స్టార్ హీరోలుగా ఎదుగుతున్న ఒకే కుటుంబానికి చెందిన హీరోలు మల్టీస్టారర్ చేయడం అనేది చాలా తక్కువ. గెస్ట్ అప్పీరియన్స్ ఉంటాయని అందరికి తెలిసిందే.అయితే మొదటి సారి ఇద్దరు స్టార్ బ్రదర్స్ ఒకే తెరపై కలిసి నటించనున్నారు. వాళ్లు ఎవరో కాదు సౌత్ బ్రదర్స్ సూర్యా - కార్తీ. ఈ కథానాయకులకు సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. తమిళ్ తో పాటు తెలుగు భాషలో అభిమానులను చాలానే సంపాదించుకున్నారు. ఇక రీసెంట్ గా మల్టీస్టార్ కోసం సన్నాహకాలు జరుగుతున్నాయని కార్తీ చెప్పేశాడు. ఇటీవల తమిళ్ లో చిన్న బాబు సినిమా ఆడియో వేడుకలో కార్తీ ఈ విషయాన్ని చెప్పాడు. చిన్న బాబు సినిమాతో మొదటి సారి కార్తీ హోమ్ ప్రొడక్షన్ లో నటిస్తున్నాడు.

ఇకపోతే ఆడియో వేడుకలో మంచి గుడ్ న్యూస్ చెప్పి కార్తీ అభిమానులను ఖుషి చేశాడు. ఆ మల్టీస్టారర్ కి సమయం కూడా ఎక్కువ పట్టదని సూర్య తరువాత సినిమా NGK తరువాత సెట్స్ పైకి వెళుతుందని కార్తీ వివరించాడు. కేవలం సినిమా వస్తుందని చెప్పిన కార్తీ సినిమాకు దర్శకుడు ఎవరు? అలాగే ఇతర నటీనటులు ఎవరనే విషయాన్ని చెప్పలేదు. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఒకవేళ వస్తే తెలుగులోల్ కూడా రికార్డులు బ్రేక్ చేస్తుందని చెప్పవచ్చు.