Begin typing your search above and press return to search.

సూర్య కోసం సూర్య వస్తున్నాడు

By:  Tupaki Desk   |   20 Oct 2017 8:18 AM GMT
సూర్య కోసం సూర్య వస్తున్నాడు
X
సందీప్ కిషన్ అదృష్టం ఏమిటో గాని జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను ఫాస్ట్ గా చేస్తున్నాడు. అతని కెరీర్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తప్పితే ఏ సినిమా అంతగా ఆడలేదు. అయితే మనోడి లుక్స్ అండ్ యాక్టింగ్ కోలీవుడ్ కి బాగా నచ్చినట్టు ఉంది. ఇక్కడకంటే అక్కడే ఎక్కువ సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకంటే ఎక్కువ బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో.

అయితే ఈ సారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ఒకే సారి తెలుగు అండ్ తమిళంలో తెరకెక్కించిన సినిమా ద్వారా ప్రేక్షకుల ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. సుసీంద్రన్ దర్శకత్వంలో C/O సూర్య అనే సినిమాను చేసిన సందీప్ నవంబర్ 10న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. మంచి యూత్ ఫుల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రమోషన్ విషయంలో కూడా కుర్ర హీరో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల చివరి వారంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాడు. అంతే కాకుండా ఈ వేడుకకి కోలీవుడ్ హీరో సూర్యని స్పెషల్ గెస్ట్ గా పిలవబోతున్నారట. తెలుగులో కూడా సూర్యా కి మంచి క్రేజ్ ఉంది. దీంతో తెలుగు ఆడియెన్స్ ని కూడా ఆకర్షించవచ్చు అని మనోడు ప్లాన్ చేస్తున్నాడు. మరి ఎంతవరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి.