Begin typing your search above and press return to search.

రెండో హ్యాట్రిక్ మొదలెట్టాడా!?

By:  Tupaki Desk   |   22 Feb 2017 12:30 AM GMT
రెండో హ్యాట్రిక్ మొదలెట్టాడా!?
X
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బోలెడంత ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సూర్య. కానీ ప్రస్తుతం ఈ హీరో ఫాం ఏమీ బాలేదు. సింగం సిరీస్ లో మూడో భాగం అయిన ఎస్3 తో సూర్య మళ్లీ బ్లాక్ బస్టర్ కొడతాడని ఎక్స్ పెక్ట్ చేస్తే.. రిజల్ట్ తేడా వచ్చింది.

ఎస్3 మూవీ తెలుగు వెర్షన్ కి వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే.. దీన్ని అమ్మిన రేట్లతో పోల్చితే మాత్రం.. రాబట్టిన మొత్తం సరిపోదు. తమిళ్ లో అయితే.. ఏకంగా ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కేటగిరీలోకి చేర్చేశారు. రివ్యూలు బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం తేడా వచ్చింది. దీనికి ముందు సూర్య నటించిన మూవీ 24. ఇది తెలుగు వెర్షన్ వరకూ హిట్ అనిపించుకున్నా.. మొత్తంగా మూవీపై పెట్టుబడి.. రాబట్టిన సొమ్ములకు సరిపోలలేదు. అద్భుతమైన మౌత్ టాక్..రివ్యూలు కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయాయి.

24 కు ముందు రాక్షసుడు(మాసు ఎంగిర మాసిళమని).. సికందర్ (అంజాన్) చిత్రాలతో ఫ్లాప్స్ చవి చూశాడు సూర్య. ఈ హీరో కెరీర్ లో చివరి హిట్ సింగం 2 మాత్రమే. ఆ తర్వాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ లేదు సరికదా.. వరుసగా 4వ ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ఓ హ్యాట్రిక్ పూర్తి చేసి.. ఫ్లాప్స్ తో రెండో హ్యాట్రిక్ మొదలుపెట్టినట్లయింది సూర్య పరిస్థితి.