పాజిటివ్ టాక్ వచ్చిందిగాని..

Sat Jan 13 2018 08:00:01 GMT+0530 (IST)

కోలీవుడ్ సినిమాలు హిట్ అయితే ఎవరు ఊహించని విధంగా కలెక్షన్స్ ని అందుకుంటాయి. ఒకవేళ డిజాస్టర్ అయితే ఉహించినత కలెక్షన్స్ కూడా అందవు. తమిళనాడులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే వారు చాలా వరకు పోటీ పడటానికి కొంచెం భయపడతారు. ఒక సినిమా బావుంటే మరొక సినిమా కలెక్షన్స్ పై తప్పకుండా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందనిక్ అక్కడివారి నమ్మకం.ఇక అసలు విషయానికి వస్తే చాలా రోజుల తరువాత అక్కడ ఇద్దరు టాప్ హీరోలు పోటీ పడుతున్నారు. సూర్యా గ్యాంగ్ అలాగే విక్రమ్ స్కెచ్ సినిమాలు శుక్రవారం రిలీజ్ అయ్యాయి. అయితే రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే పాజిటివ్ రివ్యూస్ కూడా సమానంగా అందాయి. సూర్య - విక్రమ్ కి మంచి మార్కెట్ ఉంది. ప్రయోగాలు చేయడంలో ఇద్దరు ధైర్యవంతులే. మొత్తానికి రెండు సినిమాలకు చాలా రోజుల తరువాత పాజిటివ్ టాక్ దక్కింది. అయితే కలెక్షన్స్ పరంగా ఎవరు ఎక్కువ సాధిస్తే వారే పొంగల్ హీరో. రేపు ఎల్లుండి సినిమాలు ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ఇకపోతే సూర్యా గ్యాంగ్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది కానీ విక్రమ్ స్కెచ్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. మొదట విడుదల చేయాలనే అనుకున్నారు కానీ టాలీవుడ్ లో వార్ వేడిగా ఉంటుందని వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు అలా ఏమిలేదని తెలుసుకొని మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. కానీ విక్రమ్ సినిమాలు తెలుగులో ఈ మధ్య అంతగా ఆడటం లేదు. మరి స్కెచ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.