సూర్య తగ్గుతున్నాడేంటబ్బా?!

Sat Jan 13 2018 22:03:12 GMT+0530 (IST)

కోలీవుడ్ హీరోల మార్కెట్ ఎక్కువగా ఉండడంతో ఆ గాలి టాలీవుడ్ కి కూడా పాకింది. అప్పట్లో కమల్ హాసన్ - రజినీకాంత్ వంటి స్టార్స్ తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలను చేసి మంచి హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత వారు తెలుగువారికి చాలా దగ్గరయ్యాడు. వారి కోలీవుడ్ సినిమాలు ఏవి డబ్ అయినా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుతున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్ అయితే ఇక్కడి స్టార్ హీరోల రేంజ్ లో ఓపెనింగ్స్ ని రాబడతాడు.కానీ నేటితరం హీరోలు చాలా వరకు తమిళ్ సినిమా డబ్ చేస్తూ కలెక్షన్స్ ని అందుకుంటున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే తెలుగు సినిమాను చేయాలని ఉందని అంటారు గాని చేయడానికి ముందుకు రారు. ఇక అసలు విషయానికి వస్తే గజిని సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సూర్య ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తూ మినిమమ్ కలెక్షన్లను అందుకునేవాడు. కానీ వరుసగా అతని మార్కెట్ తెలుగులో తగ్గుతూ వస్తోంది. కనీసం తమ్ముడు కార్తి రేంజ్ లో కూడా రాబట్టలేకపోతున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన అతని గ్యాంగ్ సినిమా ఇప్పటివరకు కేవలం రూ.1 కోటి షేర్స్ ని మాత్రమే రాబట్టింది. జై సింహా - అజ్ఞాతవాసి సినిమాకంటే ఆ సినిమాకే పాజిటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం సూర్యా వెనుకబడ్డాడు. మిగతా తమిళ్ హీరోలు వారి మార్కెట్ ను పెంచుకుంటూ వస్తుంటే సూర్యా మాత్రం తగ్గుతూ ఉన్నాడు. మరి పండగ సీజన్ లో మనోడి అదృష్టం ఏమైనా మారుతుందో లేదో చూడాలి.