Begin typing your search above and press return to search.

గ్యాంగ్ లో ఇంత మార్పా

By:  Tupaki Desk   |   16 Jan 2018 7:12 AM GMT
గ్యాంగ్ లో ఇంత మార్పా
X
సంక్రాంతి సందడి మొదలుకాక ముందు రేసులో కాస్త వెనకబడి ఉంది అనిపించిన సినిమా గ్యాంగే. డబ్బింగ్ సినిమా కావడం, హైప్ పరంగా సూర్యకు ఇంతకు ముందు ఉన్న మార్కెట్ లో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం దీనికి కారణంగా పని చేసాయి. కాని మొదటి మూడు రోజుల తర్వాత తమిళ్ తో పాటు తెలుగు లో కూడా గ్యాంగ్ వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండటం విశేషం. యువి క్రియేషన్స్ మొదటి సారి డబ్బింగ్ సినిమా తీసుకోవడం, కీర్తి సురేష్ హీరొయిన్ గా ఉండటంతో పాటు రమ్య కృష్ణ కీలక పాత్ర వేయటం ఇవన్ని ప్లస్ గా మారాయి. స్పెషల్ చబ్బీస్ కు కావాల్సిన మార్పులు చేసిన దర్శకుడు విజ్ఞేశ్ శివన్ దాని ఫలితం మెల్లగా అందుకుంటున్నాడు.

హీరో సూర్య తెలుగులో విస్తృతంగా ప్రచారం చేయటం కూడా బాగా కలిసి వస్తోంది. తనే స్వయంగా గుంటూరు - కృష్ణా జిల్లాల్లోని థియేటర్లకు వ్యక్తిగతంగా వెళ్లి సినిమాను ప్రమోట్ చేయటం వసూళ్ళపై అనుకూల ప్రభావం చూపిస్తోందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే నాలుగు రోజులకే చెప్పుకోదగ్గ పెరుగుదల కలెక్షన్స్ లో కనిపించడంతో యూనిట్ ప్రమోషన్ ను ఇంకా వేగవంతం చేసింది. చెన్నైలో కాకుండా సూర్య వారం రోజులుగా ఇక్కడే ఉండడానికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం అదే.

మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్(నష్టాలు వచ్చే అవకాశం లేని దశ)చేరుకుంటుంది అనే అంచనాలు ఉండగా సంక్రాంతి సినిమాల్లోకి ఆ మార్క్ రీచ్ అయ్యే మొదటి సినిమా గ్యాంగ్ అవుతుంది. ఆ రకంగా సినిమాను కొన్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారని టాక్. ముఖ్యంగా సూర్య చొరవ తీసుకుని మరీ ఇక్కడే ఉండి సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు పట్ల ప్రశంశలు దక్కుతున్నాయి.